న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ చేతిలో ఓటమి: ఆరు రోజులు నిద్రపోలేదన్న పాక్ కెప్టెన్

Asia Cup 2018 : 'I did not sleep for six days' says Sarfraz Khan
Asia Cup 2018: I did not sleep for six days, says Sarfraz Khan after Pakistan’s dismal show

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీ ప్రారంభానికి ముందు ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైన పాక్‌, బుధవారం సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఆసియాకప్ ఫైనల్లో భారత్ Vs బంగ్లా: టీమిండియా ఏడోసారి సాధించేనా?ఆసియాకప్ ఫైనల్లో భారత్ Vs బంగ్లా: టీమిండియా ఏడోసారి సాధించేనా?

దీంతో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాడంట. సూపర్-4లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడి ఆసియాకప్‌ నుంచి పాక్‌ నిష్క్రమించడంతో ఆ ఒత్తిడి తార స్థాయికి చేరిందంట. ఈ విషయాన్ని సర్ఫరాజే స్వయంగా వెల్లడించాడు. ఆసియా కప్‌లో తమ జట్టు రాణించలేకపోవడంతో తాను గత ఆరు రోజులుగా నిద్రేపోలేదని.. తీవ్ర ఒత్తిడితో గడిపానని చెప్పాడు.

పాకిస్థాన్‌ జట్టుకు కెప్టెన్సీ చేయడం పెద్ద సవాల్‌

పాకిస్థాన్‌ జట్టుకు కెప్టెన్సీ చేయడం పెద్ద సవాల్‌

అంతేకాదు కెప్టెన్సీ బాధ్యతల వల్ల ఒత్తిడికి గురికావడంతో పాటు తాను బ్యాటింగ్‌ కూడా సరిగా చేయలేకపోయానని వెల్లడించాడు. సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ "పాకిస్థాన్‌ జట్టుకు కెప్టెన్సీ చేయడం పెద్ద సవాల్‌. కెప్టెన్‌గా ఎవరున్నా తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. మనం సరిగా ఆడకపోయినా.. జట్టు ఓడిపోయినా ఆ ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది" అని అన్నాడు.

 ఆరు రోజులుగా నేను నిద్రపోలేదంటే ఎవరూ నమ్మకపోవచ్చు

ఆరు రోజులుగా నేను నిద్రపోలేదంటే ఎవరూ నమ్మకపోవచ్చు

"నిజం చెప్పాలంటే ఆరు రోజులుగా నేను నిద్రపోలేదంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ, ఇది కూడా జీవితంలో ఒక భాగం. ఆడడం ఒక్కటే నా పని. జట్టు ఎంపిక ఇవన్నీ నా చేతుల్లో లేవు" అని సర్ఫ్‌రాజ్‌ అన్నాడు. ఆసియా కప్‌లో ఓటమి కారణంగా జట్టులో మార్పుల విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవద్దని తమ బోర్డుని కోరాడు.

 ఒక కెప్టెన్‌గా నా ప్రదర్శన బాగుండాలి

ఒక కెప్టెన్‌గా నా ప్రదర్శన బాగుండాలి

"నా ఆటతీరు బాగా లేదు. అందుకే జట్టు ఓడిపోయింది. ఒక కెప్టెన్‌గా నా ప్రదర్శన బాగుండాలి. కానీ, నన్ను నేను నిరూపించుకోలేకపోయాను. అయితే, నేను విశ్రాంతి తీసుకోవాల్సి ఉందా? అనే విషయాన్ని సెలెక్టర్లు నిర్ణయిస్తారు. మైదానంలో ఆడుతూ ఉండడమే నా కర్తవ్యం. మా జట్టులోని లోపాలను సరిచేసుకుంటూ టోర్నీలు ఆడాల్సి ఉంది" అని అన్నాడు.

 ఆత్మ విశ్వాసం కోల్పోయామా?

ఆత్మ విశ్వాసం కోల్పోయామా?

"ఆసియా కప్‌లో సరిగ్గా ఆడకపోవడం వల్ల ఆత్మ విశ్వాసం కోల్పోయామా? అనే సందేహం మాలో వస్తోంది. కానీ, గత ఛాంపియన్స్‌ ట్రోఫీలో మేము మొదటి మ్యాచులో భారత్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయాం. అయినప్పటికీ, ఫైనల్‌కు వెళ్లి ట్రోఫీ గెలుచుకున్నాం" అని సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ అన్నాడు. కాగా, శుక్రవారం జరిగే ఆసియా కప్ ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.

Story first published: Friday, September 28, 2018, 9:11 [IST]
Other articles published on Sep 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X