న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ.. టెండూల్కర్‌తో సహా భారత్-పాక్‌ల అత్యుత్తమ 11జట్టిదే

Asia Cup 2018: Dhoni, Tendulkar, Imran and the all-time best India-Pakistan XI

న్యూఢిల్లీ: దాయాది దేశాలైన భారత్.. పాక్‌ల జట్లలో క్రికెట్ దిగ్గజాలు చాలా మంది ఉన్నారు. వారిలో సీకే నాయుడు దగ్గర్నుంచి ఫజల్ మొహమూద్ వరకూ అందరూ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన వారే. ప్రస్తుతం ఆసియా కప్‌లో భాగంగా బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా మూడు ఫార్మాట్‌లలో అత్యుత్తమ ప్రదర్శనల ఆధారంగా బెస్ట్ ఎలెవన్ జట్టును విశ్లేషిస్తే..

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ 18426పరుగులు చేసి 463 వన్డేలు ఆడిన టెండూల్కర్ చాలా వరకూ మ్యాచ్‌లలో ఓపెనర్‌గా వ్యవహరించాడు. సాధారణంగా ఆయన మిడిల్ ఆర్డర్‌లో దిగేందుకు ఇష్టపడతాడు. ఫేస్ అండ్ స్పిన్‌ బౌలర్లకు టెండూల్కర్ చుక్కలు చూపెట్టిన సందర్భాలు కోకొల్లలు. సచిన్ కెరీర్‌లో దిగ్గజాలైన అల్లాన్ డొనాల్డ్, కర్ట్లీ ఆంబ్రోస్, వసీం అక్రం, వఖర్ యూనిస్, గ్లెన్ మెక్‌గ్రాత్, షోయబ్ అక్తర్ వంటి వారిని కూడా ఎదుర్కొన్నాడు.

 సయ్యద్ అన్వర్

సయ్యద్ అన్వర్

ఏ జట్టు అయినా రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఉండాలని ఆశిస్తోంది. సచిన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా సరిపోతే సయ్యద్ అన్వర్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా చక్కగా నప్పుతాడు. అన్వర్ తన కెరీర్‌లో 247 మ్యాచ్‌లు ఆడి 8824పరుగులు సాధించాడు. భారత్‌తో ఆడిన వన్డే మ్యాచ్‌లో అత్యధికంగా 194 పరుగుల రికార్డు ఉంది.

 రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. ఇప్పటికీ అలా మూడు సార్లు చేయగలిగాడు. ఈ క్రమంలోనే రోహిత్ పరిమిత ఓవర్ల అత్యధిక స్కోరు 264పరుగులు. ప్రతిదాడికి దిగి ఆడటంలో నేర్పరి. ప్రపంచ నంబర్ వన్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీకి సమానమైన ప్రతిభ గల క్రికెటర్. రోహిత్ మూడో స్థానంలో చక్కగా నప్పే ఆటగాడు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడే బ్యాట్స్‌మన్. అతని ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అతను నాలుగో స్థానంలో దిగితే సరిపోతదని అంచనా. కోహ్లీ కెరీర్‌లో 211వన్డేలు ఆడి 35 సెంచరీలు చేశాడు. 58.20 సగటుతో 9779 పరుగులు సాధించాడు.

జావేద్ మియాందాద్

జావేద్ మియాందాద్

టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తర్వాత జట్టు తీరుతెన్నులు మార్చగలిగింది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. ఆ స్థానానికి జావేద్ మియాందాద్ సరిగ్గా సరిపోతాడు. 1980ల్లో వన్డే క్రికెట్ ప్రపంచంలో వెలిగిన ధ్రువతార. వన్డే కెరీర్‌లో 7381పరుగులు చేసి సత్తా చాటాడు. ఇతను ఇండియాతో ఆడిన ఆఖరి మ్యాచ్‌లో చివరి బంతిని సిక్సుగా బౌండరీకి తరలించాడు.

 ఎంఎస్ ధోనీ(కెప్టెన్/వికెట్ కీపర్)

ఎంఎస్ ధోనీ(కెప్టెన్/వికెట్ కీపర్)

ధోనీ జట్టుకు ప్రధాన బలం. జట్టును విజయతీరాలకు చేర్చడంలో దిట్ట. మంచి గేమ్ ఫినిషర్. కెప్టెన్‌గానూ ప్రశాంతతో వ్యవహరించి వికెట్ కీపింగ్‌ను చక్కగా నిర్వహించగలడు. 321 వన్డేలు ఆడిన ధోనీ కెరీర్‌లో 51.25 సగటుతో 10046 పరుగులు ఉన్నాయి. వికెట్ల మధ్య పరుగులు తీయడంలో అలసత్వం కనిపించని బ్యాట్‌మెన్‌లో ధోనీ అగ్రగణ్యుడు. కెప్టెన్‌గానూ చక్కటి నాయకత్వంతో వ్యవహరిస్తాడు. 50ఓవర్ల ఫార్మాట్‌లో 2011వన్డే వరల్డ్ కప్, టీ20 ఫార్మాట్‌లో 2007 వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

 కపిల్ దేవ్

కపిల్ దేవ్

వన్డే ఫార్మాట్‌లో ఓ ప్రమాదకర ఆల్ రౌండర్ కపిల్ దేవ్. 225వన్డేలు ఆడిన కపిల్ 3783 పరుగులు సాధించి 253 వికెట్లు తీశాడు. అతని పరుగుల కంటే సగటుకే మంచి విలువ ఎందుకంటే 95.07సగటు కలిగి ఉన్నాడు. త్వరితగతిన పరుగులు చేయడంలో టార్గెట్‌ను త్వరగా చేధించడంలో కీలక ప్లేయర్.

 ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్

వేగవంతమైన.. మాయాజాలాన్ని ప్రదర్శించే బౌలర్ ఇమ్రాన్ ఖాన్. మైదానంలోనే కాదు.. మైదానం బయట కూడా అదే దృఢ చిత్తం కలవాడు. 1992ప్రపంచ కప్ విజేత పాకిస్తాన్ జట్టులో ఒకడు. కెప్టెన్‌గా వ్యవహరించిన సందర్భాల్లో అతని సహ ఆటగాళ్లకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలుగజేయడంలో దిట్ట. ఇతని కెరీర్‌లో 175వన్డేలు ఆడి 182 వికెట్లను తీసి 3709పరుగులు సాధించాడు.

వసీం అక్రం

వసీం అక్రం

బంతితో మాయాజాలం ప్రదర్శించగల బౌలర్లలో వసీం అక్రం ముందుంటాడు. అతని వన్డే కెరీర్‌లో 500వికెట్లు తీశాడు. చాలా సందర్భాల్లో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ఆరంభ ఓవర్లలోనే అతనితో బౌలింగ్ చేయిస్తారు. 356 వన్డేలు ఆడిన అక్రం 3.8 ఎకానమీ కలిగి లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడు.

అనిల్ కుంబ్లే

అనిల్ కుంబ్లే

భారత జట్టులో ఒకప్పటి ఆశాకిరణం. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. అతని బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ కనబడాల్సిందే. టెయిలెండర్ల మాటకొస్తే.. ఇక వాళ్ల పని అంతే. 271వన్డేలు ఆడిన కుంబ్లే 337 వికెట్లు తీశాడు.

సఖ్లైన్ ముస్తఖ్

సఖ్లైన్ ముస్తఖ్

వీరందరికీ భిన్నమైన వాడు సఖ్లైన్ ముస్తఖ్. ఇతనొక ట్రెండ్ సెట్టర్. జట్టులో తొలి బౌలర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టించగలడు. చాలా వరకూ ఇతని అంచనాలను బ్యాట్స్‌మన్ పసిగట్టలేడు. దానికి నిదర్శనం ఆయన ఆడిన 169 వన్డే మ్యాచ్‌లలో 288వికెట్లు తీయడమే.

Story first published: Wednesday, September 19, 2018, 15:49 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X