ఇరానీ కప్: రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్‌

Posted By:
Ashwin to replace injured Jadeja in RoI squad for Irani Cup

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చోటు దక్కించుకున్నాడు. శనివారం బీసీసీఐ ఇరానీ కప్‌లో ఆడే రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టును ప్రకటించింది. గాయంతో బాధపడుతోన్న జడేజాకు విశ్రాంతిని ఇచ్చి అతడి స్థానంలో అశ్విన్‌కు చోటు కల్పించింది.

ఇటీవల ముగిసిన దేవధర్‌ ట్రోఫీ నుంచి అశ్విన్‌ చివరి నిమిషంలో గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించడంతో తిరిగి జడేజా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. మార్చి 14 నుంచి 18 వరకు నాగ్‌పూర్‌లో ఇరానీ కప్‌ జరగనుంది.

రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన విదర్భతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తలపడనుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు కెప్టెన్‌గా కరుణ్ నాయర్ కొనసాగనున్నాడు. అశ్విన్‌తో పాటు జట్టులో మయాంక అగర్వాల్, పృథ్వీ షా లాంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం అశ్విన్, జడేజా కేవలం టెస్టు క్రికెట్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే.

రెస్ట్ ఆఫ్‌ ఇండియా:
కరుణ్‌ నాయర్(కెప్టెన్‌), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, సమర్థ్‌, మయాంక్‌ అగర్వాల్‌, హనుమాన్‌ విహారి, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌, నదీం, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, నవ్‌దీప్‌ సైనీ, అతిత్ సేథ్‌.

Story first published: Saturday, March 10, 2018, 15:35 [IST]
Other articles published on Mar 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి