న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ స్పిన్నర్ లియాన్ రికార్డుని కొన్ని గంటల్లోనే సమం చేసిన అశ్విన్

By Nageshwara Rao
Ashwin joins Lyon as highest wicket-taker in Tests in 2017

హైదరాబాద్: యాషెస్ టెస్టు సిరిస్ సందర్భంగా ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే నాథన్ లియాన్ రికార్డు నెలకొల్పి కొన్ని గంటలైనా గడవకముందే భారత్ ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దానిని సమం చేశాడు.

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో లియాన్ 4 వికెట్లు తీయడంతో మొత్తం 55 వికెట్లతో ఈ సీజన్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ సైతం 3 వికెట్లు తీయడంతో లియాన్ రికార్డుని సమం చేశాడు.

దీంతో ఈ ఏడాది ఇప్పటవరకు వీరిద్దరూ 55 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్ధానంలో ఉన్నారు. లియాన్ ఈ ఘనత సాధించేందుకు 9 టెస్టులు ఆడగా, అశ్విన్ 11 మ్యాచుల్లోనే ఈ మైలు రాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ 54 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ 51 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా రవీంద్ర జడేజా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 356/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పర్యాటక జట్టు మరో 17 పరుగులు జోడించి చివరి వికెట్ కోల్పోయింది.

నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యాక 5 ఓవర్ల వ్యవధిలోనే ఆఖరి వికెట్‌ను కోల్పోయింది. లంక కెప్టెన్ దినేశ్‌ చండిమాల్‌ (164) పరుగుల వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 373 పరుగులు చేసిన ఆలౌటైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 5, 2017, 11:44 [IST]
Other articles published on Dec 5, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X