న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దీప్తి శర్మ మన్కడింగ్ రనౌట్‌ను సమర్థించిన అశ్విన్..! సామ్ బిల్లింగ్స్ కామెంట్లపై ఇచ్చిపడేసిన అశు భాయ్

Ashwin Backed Deepti Sharma for Her Mankading Runout, He Slams Sam Billings Who Commented

భారత వుమెన్స్ స్టార్ బౌలర్ దీప్తిశర్మ వివాదాస్పద రీతిలో రనౌట్‌ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 1నుంచి అన్ ఫెయిర్ రనౌట్ నుంచి లీగల్ రనౌట్ కిందకు మన్కడింగ్ రాబోతుంది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ రనౌట్ సరైనదేనని ఐసీసీ అప్డేటెడ్ రూల్స్ చెబుతున్నాయంటూ కొందరు ఆమెను సమర్థిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇకపోతే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన సామ్ బిల్లింగ్స్‌..

దీప్తి శర్మ రనౌట్ విధానం పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిందని, ఇది క్రికెట్ స్పిరిట్‌కు మాయని మచ్చని పేర్కొంటూ ట్విట్టర్లో పోస్టుల పరంపరతో ట్వీట్లు చేశాడు. అయితే ఈ విషయం భారత స్టార్ ఆల్రౌండర్ అశ్విన్ స్పందిస్తూ.. సామ్ బిల్లింగ్స్ మీద విరుచుకుపడ్డాడు. గతంలో అశ్విన్ ఐపీఎల్లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అదో పెద్ద దుమారమైంది.

దీప్తి సరైన పనే చేసింది

ఇక సెప్టెంబర్ 24న శనివారం లార్డ్స్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వుమెన్స్ జట్ల మధ్య జరిగిన మూడోది మరియు చివరిదైన వన్డేలో చార్లీ డీన్‌ను అవుట్ చేయడానికి దీప్తి శర్మ మన్కడింగ్ పద్ధతిని ఉపయోగించింది. తద్వారా ఇంగ్లాండ్‌పై భారత్ 3-0తేడాతో సిరీస్ క్లీన్‌స్వీప్‌ పూర్తి చేసింది. తద్వారా ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామికి ఘన వీడ్కోలు లభించింది. సామ్ బిల్లింగ్స్ ట్వీట్ల పట్ల అశ్విన్ రంగంలోకి దిగి ఇలా రాశాడు.. 'వాస్తవానికి దీప్తి శర్మ చేసిన పని చాలా గొప్ప ఆలోచన. విపరీతమైన ఒత్తిడిలో ఉన్న బౌలర్‌కు ఆ వికెట్‌ను ఎలా తీయాలనే విషయంలో ఓ పక్కా ప్లాన్ ఉంది. ఆమె దాన్ని సరిగ్గా అమలు చేసింది. ఈ వికెట్ ద్వారా తాను కాస్త విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలే దీన్ని రనౌట్‌గా పరిగణిస్తామని అప్డేట్ ఇచ్చినప్పుడు ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ఎలా అని భావించి ఉండవచ్చు. ఆమె సరైన పనే చేసింది' అని అశ్విన్ అన్నాడు. "

వార్నింగ్ లేదా పెనాల్టీ విధించాలి

వార్నింగ్ లేదా పెనాల్టీ విధించాలి

ఈ వివాదాస్పద రనౌట్‌పై తోటి ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్‌తో ట్వీట్ల రిప్లేలో బిల్లింగ్స్‌ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'ఇది ఆమోదయోగ్యమైనదిగా భావించే ఆట కాదు. ప్లేయర్ ఇంటెన్సన్ కచ్చితంగా సరిగ్గా లేదు. అసలు ఇది క్రికెట్ కాదు. క్రికెట్ చట్టాలకు లోబడి కాదు అప్పుడప్పుడు క్రీడా స్ఫూర్తితో ఆట ఆడాలి. నా అభిప్రాయం ప్రకారం ఈ రూల్‌కు సంబంధించి.. తొలి హెచ్చరిక, లేదా పెనాల్టీ రన్స్‌లాగా మార్చాలి. చాలా మంది ఈ చర్యను ఏకీభవించలేదని చెప్పొచ్చు' అని సామ్ బిల్లింగ్స్ అన్నాడు. అలాగే రనౌట్‌కు సంబంధించిన ఫోటోను కూడా పోస్టు చేశాడు. దీనికి అలెక్స్ హేల్స్ వత్తాసు పలికాడు. 'డెలివరీ టైంలో దీప్తి శర్మ అసలు బ్యాటర్ వైపు చూడడం లేదు. నాన్ స్ట్రైకర్‌ బౌలర్‌ను కనిపెడుతూ క్రీజులో ఉండటం కష్టం' అని హేల్స్ తెలిపాడు.

కన్నీటి పర్యంతమైన ఛార్లీ డీన్

కన్నీటి పర్యంతమైన ఛార్లీ డీన్

ఇకపోతే చివరి ఆరు ఓవర్లల్లో ఇంగ్లాండ్ 16పరుగులు చేయాల్సిన తరుణమొచ్చింది. చివరి వికెట్‌గా ఛార్లీ డీన్.. మన్కడింగ్ ద్వారా అవుట్ అయింది. అయితే ఆమె కడవరకు క్రీజులో ఉంటే ఇంగ్లాండ్ గెలిచేలా ఉంది. కానీ అనూహ్యంగా మన్కడింగ్ ద్వారా ఆమె ఔటవ్వడంతో ఇంగ్లాండ్ జట్టు దిగ్భ్రాంతికి గురైంది. డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్లు షాక్‌కు గురయ్యారు. అప్పటికే ఆమె 80బంతుల్లో అయిదు ఫోర్లతో 47పరుగులు చేసింది. ఈ ఘటనతో ఛార్లీ కన్నీటి పర్యంతం అయింది. పిచ్ మీద ఏడ్చేసింది. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఫ్రేయా డేవిస్ ఆమెను ఓదార్చింది.

Story first published: Sunday, September 25, 2022, 18:10 [IST]
Other articles published on Sep 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X