న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'లక్ష్మణ్‌ చేసిన ఆ 96 పరుగులే గత దశాబ్దపు అత్యుత్తమ ప్రదర్శన'

Ashish Nehra names his pick for performance of the decade

ఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు, హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్ లక్ష్మణ్‌ 2010 డర్బ్‌న్‌లో దక్షిణాఫ్రికాపై చేసిన 96 పరుగులే గత దశాబ్దపు అత్యుత్తమ ప్రదర్శన అని భారత మాజీ పేసర్ ఆశిష్‌ నెహ్రా అంటున్నారు. భారత్‌పై ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్ ఎనిమిది వికెట్ల ప్రదర్శన 2010-19లో ఉత్తమ ఇన్నింగ్స్‌ అని ఆయన అభిప్రాయపడ్డాడు.

కోహ్లీకి అరుదైన గౌరవం.. ఈ దశాబ్దపు టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా విరాట్!!కోహ్లీకి అరుదైన గౌరవం.. ఈ దశాబ్దపు టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా విరాట్!!

లైయన్‌ మాయాజాలం అదుర్స్:

లైయన్‌ మాయాజాలం అదుర్స్:

తాజాగా ఈఎస్పీఎన్ క్రికిన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెహ్రా మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికాపై లక్ష్మణ్‌ ఇన్నింగ్స్‌, భారత్‌పై లైయన్ ప్రదర్శన 2010-19లో ఉత్తమ ఇన్నింగ్స్‌లు. 2017లో చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో లైయన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అదికూడా మొదటిరోజు సాధించడం విశేషం. పిచ్‌పై ఉన్న తేమని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే తేమ ఎక్కువ సేపు లేకపోయినా.. తన మాయాజాలంతో అదరగొట్టాడు. భారత్‌లో మనోళ్లను బోల్తా కొట్టించాడు' అని అన్నాడు.

అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అదే:

అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అదే:

'డర్బన్‌ పిచ్‌పై లక్ష్మణ్‌ చేసిన 96 పరుగులనే గత దశాబ్దపు అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అని నేను భావిస్తా. డర్బన్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించదు. అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్‌ పోరాడి ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. పేసర్ జహీర్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు లక్ష్మణ్‌ 70 పరుగులు జోడించాడు. దీంతో సఫారీల ముందు 302 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. ఆ తర్వాత బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 215 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్మణ్‌ స్పెషల్ ఇన్నింగ్స్‌తోనే రెండో టెస్టు గెలిచి సిరీస్‌ సమం చేశాం' అని నెహ్రా తెలిపాడు.

 లక్ష్మణే గుర్తొస్తాడు:

లక్ష్మణే గుర్తొస్తాడు:

'చివరి టెస్టులో జాక్వస్ కలిస్‌ సెంచరీతో చెలరేగడంతో సిరీస్‌ను 2-1తో కోల్పోయాం. టెస్టుల్లో అత్యుత్తమ బ్యాటింగ్‌ గురించి మాట్లాడితే నాకు లక్ష్మణే గుర్తొస్తాడు' అని నెహ్రా చెప్పుకొచ్చాడు. లక్ష్మణ్ టీమిండియాకు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు. లక్ష్మణ్ భారత్ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. టెస్టులలో 8,781 పరుగులు.. వన్డేలలో 2, 338 పరుగులు చేసాడు.

Story first published: Wednesday, January 1, 2020, 14:27 [IST]
Other articles published on Jan 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X