న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ 2019: స్లెడ్జింగ్‌ మొదలెట్టిన ఆసీస్.. రాయ్‌ టెస్టుల్లో నీ ఆట ఏంటో చూస్తాం!!

Ashes Series 2019 : Australia Pace Bowler Josh Hazlewood Warns England Batsman Jason Roy || Oneindia
Ashes series 2019: Australia pace bowler Josh Hazlewood Warns Jason Roy Over Test Transition

లండన్‌: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2019 ప్రారంభానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆస్ట్రేలియా తమ నోరుకు పని చెప్పింది. ముఖ్యంగా అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జేసన్‌ రాయ్‌ను టార్గెట్‌ చేసింది. సిరీస్ ముందు ప్రత్యర్థి జట్లపై స్లెడ్జింగ్‌కు పాల్పడడం ఆసీస్‌కు అలవాటే. ఇదే ఆసీస్ బలం కూడా. ప్రత్యర్థి జట్టులోని స్టార్ ఆటగాళ్లపై మాటల యుద్ధం చేసి.. మ్యాచ్ ఆరంభానికి ముందే వారి ఆత్మవిశ్వాసంను దెబ్బతీయడం ఆసీస్ ఆయుధం.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

నీ ఆట ఏంటో చూస్తాం:

నీ ఆట ఏంటో చూస్తాం:

యాషెస్‌ సిరీస్‌లో నేపథ్యంలో ఈ సారి ఆసీస్ పేసర్ జోష్ హజల్‌వుడ్‌ రంగంలోకి దిగాడు. తన మాటలతో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్‌ రాయ్‌ను హెచ్చరించాడు. తాజాగా హజల్‌వుడ్‌ మాట్లాడుతూ... 'రాయ్ టెస్టుల్లో నీ ఆట ఏంటో మేమూ చూస్తాం. రాయ్ కేవలం ఒక టెస్ట్ మాత్రమే ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఫామ్‌ను టెస్టుల్లో కొనసాగించాలంటే చాలా కష్టం' అని హజల్‌వుడ్‌ అన్నాడు.

ఓపెనింగ్‌ చేయడం కష్టం:

ఓపెనింగ్‌ చేయడం కష్టం:

'వన్డే గేమ్‌ తరహాలో టెస్టుల్లో ఓపెనింగ్‌ చేయడమంటే సవాల్‌తో కూడుకున్నది. ఇక ఇంగ్లాండ్ లాంటి పిచ్‌లపై ఓపెనింగ్‌ చేయడం శ్రమతో కూడిన పని. బౌలర్లపై ఎదురుదాడికి దిగడం చాలా కష్టం. కుక్ మాత్రమే మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. టీమిండియాపై గత వేసవిలో ఫించ్ కూడా చాలా కష్టపడ్డాడు. వన్డే ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్‌కు చాలా తేడా ఉంటుంది. టెస్టుల్లో నీ ఆట ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉండు. మేము మా బౌలింగ్‌ దాడి చూపిస్తాం' అని హజల్‌వుడ్‌ హెచ్చరించాడు.

ఓపెనింగ్‌ చేయడం కష్టం:

'వన్డే గేమ్‌ తరహాలో టెస్టుల్లో ఓపెనింగ్‌ చేయడమంటే సవాల్‌తో కూడుకున్నది. ఇక ఇంగ్లాండ్ లాంటి పిచ్‌లపై ఓపెనింగ్‌ చేయడం శ్రమతో కూడిన పని. బౌలర్లపై ఎదురుదాడికి దిగడం చాలా కష్టం. కుక్ మాత్రమే మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. టీమిండియాపై గత వేసవిలో ఫించ్ కూడా చాలా కష్టపడ్డాడు. వన్డే ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్‌కు చాలా తేడా ఉంటుంది. టెస్టుల్లో నీ ఆట ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉండు. మేము మా బౌలింగ్‌ దాడి చూపిస్తాం' అని హజల్‌వుడ్‌ హెచ్చరించాడు.

ఐర్లాండ్‌ మ్యాచ్‌తో అరంగేట్రం:

ఐర్లాండ్‌ మ్యాచ్‌తో అరంగేట్రం:

ప్రపంచకప్‌లో అదరగొట్టడంతో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో జేసన్‌ రాయ్‌ టెస్టు ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేసిన రాయ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 1 వ తేదీ నుంచి బర్మింగ్‌హామ్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌ ఆరంభం కానుంది. ఇంగ్లండ్ తొలి టెస్టుకు మాత్రమే జట్టును ఎంపిక చేసింది.

తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు:

తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు:

జోయ్‌ రూట్‌ (కెప్టెన్‌), మొయిన్‌ అలీ, జిమ్మీ అండర్సన్‌, జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టో, స్టువార్ట్‌ బ్రాడ్‌, బర్న్స్‌, జోస్ బట్లర్‌, స్యామ్‌ కరన్‌, జోయ్‌ డెన్లీ, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, ఓల్లీ స్టోన్‌, క్రిస్‌ వోక్స్‌.

Story first published: Monday, July 29, 2019, 14:58 [IST]
Other articles published on Jul 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X