న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జెర్సీలపై పేర్లు: 142 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి

England And Australia Cricketers Will Wear Names And Numbers On Their Jerseys | Oneindia Telugu
Ashes could herald new era for Tests with names and numbers on shirts

హైదరాబాద్: 142 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మరో అపురూపమైన ఘట్టానికి తెరలేవబోతోంది. సాధారణంగా వన్డేల్లో ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపై పేర్లు ముద్రించబడి ఉంటాయి. వీటితో పాటు వారు ఎంచుకున్న జెర్సీ నెంబర్లు కూడా ఉంటాయి. జెర్సీపై ఉన్న నంబర్‌ను బట్టి ఆ ఆటగాడు ఎవరో ఇట్టే చెప్పేస్తారు క్రికెట్ అభిమానులు.

ఐపీఎల్ 2019: ఓపెనర్‌గా రోహిత్ శర్మ, వరల్డ్‌కప్ కోసమేనా?ఐపీఎల్ 2019: ఓపెనర్‌గా రోహిత్ శర్మ, వరల్డ్‌కప్ కోసమేనా?

అంతలా అభిమానులకు సుపరిచితం ఆ జెర్సీపై ఉన్న నంబర్లు. జెర్సీపై 10 ఉంటే సచిన్ అని, 7 ఉంటే ధోని అని, 18 ఉంటే కోహ్లీది అని అభిమానులు ఠక్కున చెప్పేస్తారు. అయితే, టెస్టుల్లో మాత్రం ఇందుకు భిన్నం. 142 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఏ మ్యాచ్‌లో కూడా ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, అంకెలు కనిపించింది లేదు.

టెస్టుల్లో తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలతో

టెస్టుల్లో తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలతో

టెస్టుల్లో ఆడే ఆటగాళ్లు కేవలం తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలు ధరిస్తారు. జెర్సీ వెనుక భాగంలో ఖాళీగా ఉంటుంది తప్ప, నంబర్లు ఉండవు. అంతేకాదు టెస్టుల్లో టాస్ వేసేటప్పుడు ఇరు జట్ల కెప్టెన్లు బ్లేజర్ల‌తో వెళ్లాలి. వన్డేల్లో మాత్రం అలా కాదు. అయితే, ఈ సంప్రదాయం త్వరలోనే మారబోతున్నట్లు సమాచారం.

ఆగస్టు 1 నుంచి యాషెస్ సిరిస్

ఆగస్టు 1 నుంచి యాషెస్ సిరిస్

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ యాషెస్ సిరిస్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపించనున్నారు. ఈ కొత్త సంప్రదాయానికి ఇరు దేశాలకు చెందిన బోర్డులు ఐసీసీకి ప్రతిపాదన పంపాయి.

ఐసీసీ గనుక ఆమోదం తెలిపితే

ఐసీసీ గనుక ఆమోదం తెలిపితే

ఈ ప్రతిపాదనకు ఐసీసీ గనుక ఆమోదం తెలిపితే టెస్టుల్లో తొలిసారి ఆటగాళ్లు పేర్లతో పాటు జెర్సీలపై నంబర్లతో కనిపించనున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆరంభమవుతుంది. ఆటగాళ్లు ఒకటి నుంచి 99 వరకు తమకు నచ్చిన నంబర్లను జెర్సీలపై ముద్రించేందుకు ఎంపిక చేసుకోవచ్చు.

Story first published: Wednesday, March 20, 2019, 15:06 [IST]
Other articles published on Mar 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X