న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ 2019: ఐదో టెస్టుకు మార్పుల్లేవ్!, అదే జట్టుతో బరిలోకి ఇంగ్లాండ్

Ashes 2019: England name unchanged squad for Oval finale

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో చివరిదైన ఓవల్ టెస్టుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సోమవారం జట్టుని ప్రకటించింది. నాలుగో టెస్టులో ఆడిన జట్టునే బోర్డు కొనసాగించింది. ఈ సిరిస్‌లో ఆఖరిదైన ఐదో టెస్టు సెప్టెంబర్ 12న ఓవల్ వేదికగా ఆరంభం కానుంది.

స్మిత్‌ను ఎగతాళి చేసిన ఇంగ్లీషు అభిమానులపై ఐసీసీ సెటైరికల్ ట్వీట్స్మిత్‌ను ఎగతాళి చేసిన ఇంగ్లీషు అభిమానులపై ఐసీసీ సెటైరికల్ ట్వీట్

ఈ నేపథ్యంలో ఐదో టెస్టులో ఎలాంటి మార్పులు చేయకుండా నాలుగో టెస్టుకు ఎంపిక చేసిన 13 మందితో కూడిన జట్టునే ప్రకటించింది. ఆదివారంతో ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ 185 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది.

ఈ సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టులో ఆసీస్ ఓడినా లేక సిరీస్‌ డ్రా అయినా గత యాషెస్‌లో ఆస్ట్రేలియా విజేత కాబట్టి ట్రోఫీ దాని దగ్గరే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టులో విజయం సాధించి ఆతిథ్య జట్టు పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆఖరి టెస్టులో కూడా ఆస్ట్రేలియా విజయం సాధిస్తే అరుదైన ఘనత సాధిస్తుంది.

భారత పర్యటనలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్భారత పర్యటనలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్

2001లో మార్క్ వా తర్వాత యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు తెచ్చిన మొట్టమొదటి కెప్టెన్‌గా టిమ్ పైన్ చరిత్ర సష్టిస్తాడు. ఈ సిరిస్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ స్టోక్స్ మినహాయించి మిగితా బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఈ సిరిస్‌లో బెన్ స్టోక్స్ రెండు సెంచరీలతో ఫరవాలేదనిపించాడు.

ఓపెనర్ జేషన్ రాయ్ ఈ సిరిస్‌‌లో మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆస్ట్రేలియా పేస్ ఎటాక్‌ను తట్టుకోని నిలబడలేకపోయారు. మరోవైపు ఇంగ్లాండ్ కోచ్‌గా ట్రేవర్ బేలిస్‌కు ఇది ఆఖరి టెస్టు మ్యాచ్. ఈ సిరిస్ అనంతరం అతడు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు.

Story first published: Monday, September 9, 2019, 19:13 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X