న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4th Test, Day 1: గోడలా నిలిచిన స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా 170/3

Ashes 2019, ENG Vs AUS, 4th Test, Day 1: Rain Forces Early Stumps At Old Trafford, Australia 170/3

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య బుధవారం ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టుకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. వర్షం వల్ల తొలి రోజు కేవలం 44 ఓవర్లే సాధ్యపడగా ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.

క్రీజులో మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(60 నాటౌట్‌), ట్రావిస్‌ హెడ్‌(18 నాటౌట్‌) పరుగులతో ఉన్నారు. తొలి రెండు టెస్టుల్లో అద్భుతంగా రాణించిన స్టీవ్ స్మిత్ నాలుగో టెస్టులో కూడా ఇంగ్లిష్‌ బౌలర్లకు అడ్డు నిలిచాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది.

సొంతగడ్డపై అదరగొట్టిన బుల్స్: పట్నాపై ఉత్కంఠ విజయంసొంతగడ్డపై అదరగొట్టిన బుల్స్: పట్నాపై ఉత్కంఠ విజయం

డేవిడ్ వార్నర్ డకౌట్

ఈ యాషెస్ సిరిస్‌లో వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ తొలి ఓవర్‌లోనే బ్రాడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ సిరిస్‌లో డేవిడ్ వార్నర్ ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఈ సిరిస్‌లో వార్నర్ కేవలం ఒకేఒక్కసారి మాత్రమే డబుల్ ఫిగర్ స్కోరుని అందుకున్నాడు.

ఆసీస్ ఓపెనర్ల చెత్త రికార్డు

ఈ సిరిస్‌లో ఇప్పటివరకు మార్కస్ హారిస్‌తో రెండు సార్లు ఓపెనింగ్ చేసిన వార్నర్... మరో రెండు సార్లు కామెరూన్ బాన్‌క్రాప్ట్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. తన ఓపెనింగ్ భాగస్వాములతో సరైన భాగస్వామ్యాలను నెలకొల్పడంలో డేవిడ్ వార్నర్ విఫలమయ్యాడు. దీంతో ఆసీస్ ఓపెనర్లు జాబితాలో ఓ చెత్త రికార్డు నమోదైంది.

98 పరుగులకే 2 వికెట్లు

ఆసీస్ ఓపెనర్ల యావరేజి 8.85గా నమోదైంది. చివరగా 1926లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఈ యావరేజిని నమోదు చేశారు. ఆ తర్వాత కాసేపు నిలకడగానే ఆడిన మార్కస్‌ హారిస్‌(13)ను కూడా బ్రాడ్‌ పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్‌ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో లబుషేన్‌, స్మిత్‌ జోడీ సంయమనంతో బ్యాటింగ్‌ చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.

పలుమార్లు కిందపడ్డ బెయిల్స్‌

ఇంగ్లండ్‌ బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా ముందుకు సాగుతూ... ఆడపా దడపా బౌండరీలు బాదారు. దీంతో లంచ్‌ విరామ సమయానికి ఆస్ట్రేలియా 98/2 స్థితిలో నిలిచింది. ఈ సమయంలో వర్షం పడడంతో ఆట దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. హోరు గాలి కారణంగా పలుమార్లు బెయిల్స్‌ కింద పడ్డాయి.

లాంబుస్‌చేస్‌ హాఫ్ సెంచరీ

దాంతో అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్‌ ఇన్నింగ్స్‌ 32వ ఓవర్లో బెయిల్స్‌ను తొలగించి ఆటను కొనసాగించారు. ఇలా ఆడించడంపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్, బౌలర్‌ బ్రాడ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌, లాంబుస్‌చేస్‌ తమ జోరుని కొనసాగించారు. ఈ క్రమంలో లాంబుస్‌చేస్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీ

ఈ సిరీస్‌లో అతడికిది వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీ. 32 ఓవర్లకు పైగా ఇంగ్లిష్‌ బౌలర్లను అడ్డుకున్న వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి ఓవర్‌టన్‌ బౌలింగ్‌లో లాంబుస్‌చేస్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత స్మిత్‌కు జత కలిసిన ట్రావిస్ హెడ్‌ ధాటిగా ఆడి మూడు ఫోర్లు బాదాడు. మళ్లీ వర్షం జోరందుకోవడంతో అంపైర్లు తొలిరోజు ఆట ముగిసినట్టు ప్రకటించారు.

Story first published: Thursday, September 5, 2019, 11:08 [IST]
Other articles published on Sep 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X