న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్ వేదికగా యాషెస్ రెండో టెస్టు: ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి!

Ashes 2019, 2nd Test: When And Where To Watch Live Telecast, Live Streaming

హైదరాబాద్: యాషెస్‌ సిరీస్‌లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి ఆతిథ్య జట్టుతో ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో తలపడనుంది. ప్రపంచకప్‌ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ను దాని సొంతగడ్డపై తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓడించడంతో ఈ సిరీస్‌ మరింత ఆసక్తికరంగా మారింది.

ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి టెస్టు తొలి మూడు రోజుల్లో ఇంగ్లాండే ఆధిపత్యం చలాయించినప్పటికీ.. స్మిత్‌ అద్భుతంగా పోరాడి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించడంతో 251 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.

<strong>రోహిత్ మరో 26 పరుగులు చేస్తే యువరాజ్‌ రికార్డు బద్దలు</strong>రోహిత్ మరో 26 పరుగులు చేస్తే యువరాజ్‌ రికార్డు బద్దలు

ప్రతీకారం తీర్చుకునేనా?

ప్రతీకారం తీర్చుకునేనా?

దీంతో లార్డ్స్ టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. మరోవైపు తొలి టెస్టులో రెండు సెంచరీలతో చెలరేగిన స్మిత్‌పై అందరి కళ్లూ నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక, ఇంగ్లాండ్ ప్రధాన పేసర్ జేమ్స్‌ అండర్సన్‌ గాయంతో దూరమైనందున యువ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ టెస్టు అరంగేట్రం ఖాయమైంది.

స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌కు చోటు

స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌కు చోటు

ఇక, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీపై వేటు వేసిన ఇంగ్లండ్‌ 12 మంది సభ్యుల జట్టులో స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌కు చోటు కల్పించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ జో రూట్‌‌పైనే భారం వేసింది. ఓపెనర్లు జాసన్‌ రాయ్, రోరీ బర్న్స్‌లతో పాటు బట్లర్, బెయిర్‌స్టో రాణిస్తేనే ప్రత్యర్థికి సవాల్‌ విసరగలదు.

వార్నర్‌ కూడా ఫామ్‌లోకి వస్తే

వార్నర్‌ కూడా ఫామ్‌లోకి వస్తే

ఇక, ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా ఫామ్‌లోకి వస్తే కంగారూలకు తిరుగుండదు. ఉస్మాన్‌ ఖాజా, ట్రావిస్‌ హెడ్, మాధ్యూ వేడ్‌లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. కమిన్స్‌ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తుండగా, స్పిన్నర్‌ లయన్‌ తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు.

గాయం కారణంగా ప్యాటిన్సన్‌‌కు విశ్రాంతి

గాయం కారణంగా ప్యాటిన్సన్‌‌కు విశ్రాంతి

గాయం కారణంగా ప్యాటిన్సన్‌ లార్డ్స్ టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టార్క్‌ లేదా హేజిల్‌వుడ్‌ తుది జట్టులోకి రావచ్చు. ఈ టెస్టులో గనుక ఓడితే ఇంగ్లాండ్ ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో పుంజుకోవడం కష్టమే. యాషెస్‌ చరిత్రలో తొలి టెస్టు ఓడినా ఆ జట్టు సిరీస్‌ నెగ్గిన సందర్భాలు 1981, 2005 రెండు సందర్భాలు మాత్రమే ఉన్నాయి.

ఎప్పుడు నుంచి ప్రారంభం?

ఎప్పుడు నుంచి ప్రారంభం?

ఆగస్టు 14(బుధవారం)

ఎక్కడ జరుగుతుంది?

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్

సమయం?

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3.30 గంటలకు

ఏ టీవీ ఛానల్ ప్రసారం చేస్తోంది?

సోనీ పిక్చర్స్

ఆన్ లైన్‌లో స్ట్రీమింగ్

సోనీ లివ్

Story first published: Wednesday, August 14, 2019, 12:24 [IST]
Other articles published on Aug 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X