న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏమైనా కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నా: ధోనీ

As captain you dont presume all players have common sense: Dhoni

హైదరాబాద్: టీమిండియాలో అడుగుపెట్టినప్పటి నుంచి మహేంద్ర సింగ్‌ ధోనీది ప్రత్యేక స్థానం. ఆయనలో మంచి ఆటగాడు, మంచి నాయకుడు, అంతకుమించి మంచి తండ్రి ఉన్నారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో మొదటిది కలుపుగోలు తనం. ఆయనలో ప్రస్పుటంగా కనిపించేది. ధోనీ.. సీనియర్ క్రికెటర్ల నుంచి ఇప్పటి ఆటగాళ్ల వరకూ అందరి పట్ల ఆయన ఎంతో అభిమానం చూపిస్తారు. స్నేహభావంతో మెలుగుతుంటారు. ధోనీలో ఈ లక్షణం టన్నుల కొద్దీ ఉంది.

కామన్‌ సెన్స్‌ ఉపయోగించుకోగలిగే ప్రతిఒక్కరూ నాయకులే:

కామన్‌ సెన్స్‌ ఉపయోగించుకోగలిగే ప్రతిఒక్కరూ నాయకులే:

ప్రతి ఒక్కరికీ కామన్‌ సెన్స్‌ అనేది ఉంటుంది. దాన్ని సమర్ధంగా ఉపయోగించుకోగలిగే ప్రతిఒక్కరూ నాయకులే. జట్టులో ప్రతి ఒక్కరి మనోభావాలనూ గౌరవించాలి. వారిని ఆటకు సన్నద్ధం చేయడం ఎంత ముఖ్యమో వారి అభిప్రాయాలను, నిర్ణయాలనూ గౌరవించడం కూడా అంతే ముఖ్యం. జట్టులో తమ సారథి పట్ల ఏ ఒక్క క్రికెటర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినా కెప్టెన్‌గా విఫలమైనట్లే.'

సర్ది చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌దే.

సర్ది చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌దే.

'మ్యాచ్‌ సందర్భంలో క్రికెటర్లు వేర్వేరుగా స్పందిస్తుంటారు. వారికి సర్ది చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌దే. నావరకూ అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కామన్ సెన్స్‌తో ఆలోచిస్తా. అదే నా కెప్టెన్సీ రహస్యం. ‘ఏం మాట్లాడుతన్నారీయన..మాకెందుకు చెబుతున్నారు? మాకు ఇది కూడా తెలీదా' అనే మాటలు జట్టులో ఎవరో ఒకరు అంటూనే ఉంటారని నేను విన్నాను. కానీ నా విషయంలో నాకు అలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు' అని తెలిపారు.

ధోనీకిదే నేనిచ్చే బర్త్‌డే గిఫ్ట్‌

‘ప్రత్యేకమైన రోజున ప్రత్యేక హెయిర్‌కట్‌. ధోనీకిదే నేనిచ్చే బర్త్‌డే గిఫ్ట్‌. ఈ సాహస కృత్యాలు నిపుణుల పర్యవేక్షణలో చేసినవి. ఇలాంటివి ఇంట్లో ఎవరూ ప్రయత్నించకూడదు' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌ అయింది. ఈ ట్వీట్ పై అభిమానులతో పాటు ధోనీ కూడా స్పందించాడు.

పాండ్యా మీద సెటైర్

పాండ్యా మీద సెటైర్

ధోనీలో నాయకత్వ లక్షణమే కాదు మంచి హాస్యచతురత కూడా ఉంది. అందుకే ‘నేను అన్నింటినీ కోల్పోవడంలో నిపుణుడినని నీకు ఈ పాటికే అర్థమయిందని అనుకుంటున్నాను' అంటూ పాండ్యకు బదులిచ్చాడు. శనివారం ఆయన 37 పుట్టిన రోజు జరుపుకొన్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా తన గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Story first published: Tuesday, July 17, 2018, 16:36 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X