న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంకతో ఆడేందుకు భారత జట్టులో మరో తెలుగమ్మాయి..

Arundhati Reddy eyes a long inning

న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ తరపున ఆడేందుకు మిథాలీతో పాటు మరో తెలుగమ్మాయి ఎంపికైంది. ఇప్పటికే మిథాలీరాజ్‌కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయగా... మరికొంత మంది ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో ఆడగా, ఇప్పుడు మరో అమ్మాయి జట్టులో చోటు సంపాదించుకోవడం విశేషం. హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ కాలనీకి చెందిన అరుంధతీరెడ్డి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం భారత జట్టుకు ఎంపికైంది.

కాలానుగుణంగా మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. క్రీడల్లోనూ ఎదుగుతూ పురుషులకు పోటీ ఇస్తున్నారు. అదే క్రమంలో అరుంధతి రెడ్డి.. భారత మహిళల టీ-20 జట్టులోకి ఎంపికయ్యింది. 21 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టనుంది. నగరంలోని సైనిక్‌పురి డిఫెన్స్‌ కాలనీకి చెందిన అరుంధతిరెడ్డి ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. ఈ క్రమంలోక్రికెట్‌ ప్రపంచంలో తన ప్రస్థానం. అంచలంచెలుగా ఎదిగిన విధానం.

అమ్మ ప్రోత్సాహం.. సోదరుడే ప్రేరణ:

అమ్మ ప్రోత్సాహం.. సోదరుడే ప్రేరణ:

అమ్మ పేరు భాగ్య. ఆమె మంచి వాలీబాల్‌ ప్లేయర్‌. ఆర్థిక పరిస్థితుల కారణంగా తను ఆటను మధ్యలో వదిలేసింది. ప్రస్తుతం టీచర్‌గా చేస్తోంది. నా ప్రాక్టీస్‌ కోసం తెల్లవారుజామున 3గంటలకు నిద్రలేచే వాళ్లం. ప్రాక్టీస్‌ 9.30 గంటల దాకా చేసేదాన్ని. మళ్లీ సాయంత్రం 4 గంటలకు గ్రౌండ్‌కు వచ్చేవాళ్లం. రాత్రి 7.30గంటల వరకు అమ్మ కూడా నాతోనే ఉండేది. అమ్మ నా కోసం ఎంతో కష్టపడింది. నేను ఈ స్థాయికి ఎదగడానికి ఆమె శ్రమ, ప్రోత్సాహం ఎంతో ఉంది. అన్న రోహిత్‌ మంచి క్రికెటర్‌. ప్రతిరోజూ ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లేవాడు. అన్నవాళ్లు ఆడుతుంటే బయట నిలబడి ఆటను చూస్తూ బాల్స్‌ అందించేదాన్ని. దీంతో క్రికెట్‌పై ఆసక్తి బాగా పెరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనే ఆకాంక్ష ఎక్కువైంది. ప్రతిరోజూ జింఖానాగ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేసేదాన్ని.

ఆ మ్యాచ్‌లో మిథాలీనే అవుట్ చేశా:

ఆ మ్యాచ్‌లో మిథాలీనే అవుట్ చేశా:

ఇప్పటి వరకు అండర్‌- 19, 23, సీనియర్స్, సీనియర్‌ జోనల్స్, ఛాలెంజర్స్, ఇండియా ‘ఎ', సౌత్‌ సెంట్రల్‌ రైల్వేస్‌ మ్యాచ్‌లలో ఆడాను. వీటన్నింటిలో ఆల్‌రౌండర్‌ ప్రతిభను కనబరిచా. సెప్టెంబర్‌ 19 నుంచి శ్రీలంకలో టీ20 సిరీస్‌ ఉంది. వీటిలో సత్తా చాటి మున్ముందు వన్డేల్లోకి కూడా ఎంపికవుతాననే నమ్మకముంది. ఇటీవల జరిగిన ఉమెన్స్‌ చాలెంజర్స్‌ ట్రోఫీలో ‘ఇండియా గ్రీన్‌' టీంలో ఆడాను. ‘ఇండియా బ్ల్యూ' టీంలో మిథాలీ ఉన్నారు. ఓ మ్యాచ్‌లో నేను మిథాలీని బౌల్డ్‌ చేశాను. అన్ని మ్యాచ్‌ల్లో రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాను. దీంతో భారత టీ20 జట్టులో అవకాశం దక్కింది.

మెసేజ్‌తో సర్‌ప్రైజ్‌.. మిథాలీ స్టైల్‌కు ఫిదా:

మెసేజ్‌తో సర్‌ప్రైజ్‌.. మిథాలీ స్టైల్‌కు ఫిదా:

ఈ నెల 23న ఎప్పటిలాగానే క్రికెట్‌ గ్రౌండ్‌కి వెళ్లి ప్రాక్టీస్‌ చేశా. సాయంత్రం 6.30గంటలకు ఇంటికి బయలుదేరుతూ.. టేబుల్‌లో ఉన్న ఫోన్‌ తీసి చెక్‌ చేస్తుంటే నా స్నేహితురాలు అనన్య ఉపేంద్ర నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘కంగ్రాట్స్‌ డియర్‌.. యూ ఆర్‌ సెలక్టెడ్‌ ఇన్‌ ఇండియా టీ20 టీమ్‌' అని ఉంది. ఒక్కసారిగా కళ్లు చెమర్చాయి. ఆ వెంట వెంటనే ఎనిమిది మంది నుంచే కంగ్రాట్స్‌ మెసేజెస్‌ వచ్చాయి. ఇండియన్‌ టీం కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ఆటను చూస్తూ పెరిగాను. ఆమెను నేను అక్కా అని పిలుస్తా. రెండేళ్ల క్రితం సౌత్‌ సెంట్రల్‌ రైల్వేస్‌కు సెలెక్ట్‌ అయినప్పుడు మిథాలీ అక్కతో నాకు మరింత అనుబంధం పెరిగింది. మిథాలీ అక్క షాట్లకు ఫిదా అయ్యాను.

రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ:

రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ:

మహిళా క్రికెట్‌పై అందరిలోనూ ఆదరణ పెరుగుతోంది. చాలామంది అమ్మాయిలు క్రికెట్‌ వైపు చూస్తున్నారు. అరుంధతికి ఎన్నో సలహాలు ఇచ్చాను. ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్‌ నుంచి నా పేరు ఒక్కటే వినిపించేది. ఇప్పుడు నాతో పాటు అరుంధతి పేరు అంతర్జాతీయంగా వినిపించడం ఎంతో ఆనందంగా ఉంది. అరుంధతిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎంతో మంది ముందుకు రావాలి.

Story first published: Friday, August 31, 2018, 13:09 [IST]
Other articles published on Aug 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X