వడోదరలో వన్డే టోర్నీ: ముంబయి అండర్-19 జట్టులో అర్జున్‌కు చోటు

 Arjun Tendulkar Named in Mumbai U-19 Team For Invitational ODI Tournament

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబయి అండర్-19 క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 6వ ఆల్ ఇండియా అండర్-19 జేవై లీలా ఇవ్విటేషనల్ వన్డే టోర్నమెంట్‌లో ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.

సెప్టెంబర్ 16న ఆరంభం కానున్న ఈ టోర్నమెంట్ వడోదరలో జరగనుంది. ముంబయి జట్టుకు సువెద్ పార్కర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు ముంబయి క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఉన్‌మేష్ ఖాన్విల్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

18 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ గత జులైలో శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన యూత్ టెస్టులో భారత్ అండర్-19 జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. అయితే, ఈ పర్యటనలో అర్జున్ టెండూల్కర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.

ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న భారత బ్యాట్స్‌మెన్‌కు ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ కూడా చేశాడు. ఎడమ చేతివాటం బౌలర్ కావడంతోనే ఇంగ్లాండ్‌లో అర్జున్ చేత బౌలింగ్ చేయించినట్లు భారత బౌలింగ్ కోచ్ అప్పట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ముంబయి జట్టు:
Suved Parkar (Captain), Divyansh Saxena, Karan Shah,Pragnesh Kanpillewar, Hashir Dafedar, Arsalan Shaikh, Yash Salunkhe, Kesar Singh Thapa, Vaibhav Kalamkar, Atharva Ankolekar, Bhushan Jalawadkar, Praful Devkate, Arjun Tendulkar Uzair Khan, Balwant Singh Sodha and Saksham Parashar.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Wednesday, September 12, 2018, 12:49 [IST]
  Other articles published on Sep 12, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more