న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా మీడియా సచిన్ కొడుకుని వదలడం లేదు

Arjun Tendulkar Delivers All-round Performance at SCG

హైదరాబాద్: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ కొడుకు అర్జున్‌ టెండూల్కర్ పీకల్లోతులో మునిగిపోయాడు. అదీ పొగడ్తలతో.. ఆ వర్షం కురిపించి ఆసీస్‌ మీడియా.. ఎందుకో తెలుసా.. అర్జున్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన గురించి. అర్జున్‌ నాలుగు ఓవర్లకి నాలుగు వికెట్లు తీయడంతో అందరితో పాటు ఆసీసీ మీడియా మామూలుగా లేపట్లదు.

ప్రస్తుతం అర్జున్‌ ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్‌ మైదానం ఆధ్వర్యంలో జరుగుతోన్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. లీగ్‌లో భాగంగా బ్రాడ్‌మన్‌ ఓవల్‌ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో అర్జున్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. 4 ఓవర్లలో నాలుగు వికెట్లు తీయడంతోపాటు 27 బంతుల్లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

దీంతో ఆస్ట్రేలియా మీడియా సైతం అర్జున్ ఆటతీరును మెచ్చుకుంది. తాజాగా అర్జున్‌ ఓ మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. 'దిగ్గజ ఆటగాడు బ్రాడ్‌మెన్‌ పేరిట ఉన్న ఓవల్‌ మైదానంలో ఆడటం చాలా ఆనందంగా ఉంది. నమ్మలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఫాస్ట్‌ బౌలింగ్‌ అంటే ఇష్టం. మిచెల్‌ స్టార్క్‌(ఆస్ట్రేలియా), బెన్‌ స్టోక్స్‌(ఇంగ్లాండ్‌) నా అభిమాన ఆటగాళ్లు. మరింత దృఢంగా వీలైనంత త్వరగా గొప్ప ఫాస్ట్‌ బౌలర్‌గా ఎదగాలి.' అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

'భయం లేకుండా ఆడు. నీ జట్టు కోసం ఆడు. ఆటగాడిగా నువ్వు జట్టుకు ఎంత సాయం చేయగలవో అంతవరకు చెయ్యి' అని నా తండ్రి ఎప్పుడూ చెప్తుంటారు. దీనివల్ల నేను ఎలాంటి ఒత్తిడికి గురవ్వను. బౌలింగ్‌ చేస్తున్నంత సేపు.. బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించకుండా బంతులేయాలి అని, బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. వీటి గురించే ఆలోచిస్తా' అని అర్జున్‌ తన తండ్రి సచిన్ మాటలను గుర్తు చేసుకున్నాడు.

కాగా, జనవరి 7న మొదలైన స్పిరిట్ ఆఫ్ గ్లోబల్ ఛాలెంజ్' జనవరి 14తో ముగియనుంది. ఈ లీగ్‌లో SCG XI, Marylebone Cricket Club, Cricketer's Club of India, Singapore Cricket Club, Hong Kong Cricket Club, South Australian Cricket Association, Singalese Cricket Club, Izingari లు పాల్గొనున్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 12, 2018, 13:33 [IST]
Other articles published on Jan 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X