న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మీరు ఒంటరిగా ఉన్నారా?: అభిమాని ప్రశ్నకు స్మృతి మంధాన చిలిపి సమాధానం

‘Are you single right now?’ – A fan asks Smriti Mandhana; here is how she responded

హైదరాబాద్: టీమిండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసింది. ఈ చాటింగ్‌లో ఆమె అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. 23 ఏళ్ల స్మృతి మంధాన అంటే కుర్రకారుకు సైతం ఇష్టం.

ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమె ఎవరితోనైనా ప్రేమలోనైనా ఉందా? అని తెలుసుకొనేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం మీరు ఒంటరిగా ఉంటున్నారా? అని ప్రశ్నించగా 'ఉమ్‌మ్‌మ్‌.. బహుశా' అని సమాధానమిచ్చింది.

పింక్‌ బాల్‌తో అనుభవం భిన్నంగా ఉంది: తొలి డే/నైట్ టెస్టుపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలుపింక్‌ బాల్‌తో అనుభవం భిన్నంగా ఉంది: తొలి డే/నైట్ టెస్టుపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

మరొక అభిమాని ఎవరిపై క్రష్‌ ఉందని అడగ్గా 'నేను పదో ఏట ఉన్నప్పటి నుంచి హృతిక్‌ రోషన్‌పై' అంటూ స్మృతి మంధాన చెప్పింది. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో స్మృతి మంధాన అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.

వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన మూడో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 51 ఇన్నింగ్స్‌ల్లోనే మంధాన ఈ అరుదైన మైలురాయి సాధించింది. ఫలితంగా శిఖర్ ధావన్ (48) తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకు రెండో భారత క్రికెటర్‌గా నిలిచింది.

India vs Bangladesh: వికెట్ దూరంలో అశ్విన్, కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు!India vs Bangladesh: వికెట్ దూరంలో అశ్విన్, కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు!

కాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత వెస్టిండిస్‌తో ముగిసిన సిరిస్‌తోనే జట్టులోకి వచ్చింది. ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో స్మృతి మంధాన 63 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మంధాన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

51 మ్యాచ్‌ల్లో 43.08 యావరేజితో 2025 పరుగులు చేయడంతో... కోహ్లీ (53), గంగూలీ (52), సిద్ధు (52) కంటే అత్యంత వేగంగా వన్డేల్లో 2000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది. మహిళల క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్(45 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉంది. బెలిండా క్లార్క్ కేవలం 40 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాదించింది.

Story first published: Wednesday, November 13, 2019, 19:55 [IST]
Other articles published on Nov 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X