న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అదే బౌలింగ్ యాక్షన్: శ్రీలంక మరో మలింగను తయారు చేస్తోందా? (వీడియో)

 Another Lasith Malinga on The Making For Sri Lanka

హైదరాబాద్: లసిత్ మలింగ... పరిచయం అక్కర్లేని పేరు. ఒత్తైన జులపాలతో కాస్త భిన్నంగా ఉంటాడు. అతడు బౌలింగ్ చేస్తుంటే జూలుతో ఉన్న సింహాం పరుగెత్తుకొస్తున్నట్లే ఉంటుంది. ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్లకు అతడి బౌలింగ్ అర్ధం కాక తలలు పట్టుకున్న సందర్భాలు అనేకం. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో శ్రీలంక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ప్రపంచ క్రికెట్‌లో లసిత్ మలింగను వైవిధ్యమైన బౌలర్‌గా నిలబెట్టింది అతడి యాక్షనే. అంతర్జాతీయ క్రికెట్‌లో సక్సెస్ అయిన బౌలర్లను ఆ తర్వాతి తరం బౌలర్లు అనుకరిస్తుంటారు. అచ్చం వారిలాగే బౌలింగ్ చేసి వికెట్లు తీయాలని ఆరాటపడుతుంటారు. ఇందులో భాగంగా తెరపైకి మలింగ లాంటి బౌలర్ ఒకడు వచ్చాడు.

IAAF World Championships 2019: బోల్ట్ లేకుండా తొలిసారి, భారత్ నుంచి 27 మందిIAAF World Championships 2019: బోల్ట్ లేకుండా తొలిసారి, భారత్ నుంచి 27 మంది

మలింగ బౌలింగ్ యాక్షన్ ఎలాగ ఉంటుదో

మలింగ బౌలింగ్ యాక్షన్ ఎలాగ ఉంటుదో

మలింగ బౌలింగ్ యాక్షన్ ఎలాగ ఉంటుదో అతడి బౌలింగ్ యాక్షన్ కూడా అలాగే ఉంది. అంతేకాదు తాను అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అతడి పేరు మతీషా పతిరాణా. వయసు 17 ఏళ్లు. శ్రీలంకలోని కాండీలో ట్రినిటీ కాలేజ్ తరుపున ఆడిన అతడు తన అరంగేట్ర మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి 7 పరుగులిచ్చాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, లసిత్ మలింగ విషయానికి వస్తే, 1983, ఆగష్టు 28న జన్మించాడు. శ్రీలంక తరుపున లసిత్ మలింగ ఇప్పటి వరకు 30 టెస్టులు మరియు 226 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 33.16 సగటుతో 101 వికెట్లు సాధించాడు.

ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను మూడు సార్లు

ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను మూడు సార్లు

అందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను మూడు సార్లు పడగొట్టాడు. ఇక, బ్యాటింగ్‌లో అత్యధిక స్కోరు 64 నాటౌట్. ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో లంక 91 పరుగుల తేడాతో విజయం సాధించి వెటరన్‌ పేసర్‌ మలింగకు ఘనంగా వీడ్కోలు పలికాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు పలికాడు.

టీ20లకు మాత్రమే అందుబాటులో

టీ20లకు మాత్రమే అందుబాటులో

ప్రస్తతం మలింగ టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్, వెటరన్ పేసర్ లసిత్‌ మలింగ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి సంచలనాన్ని నమోదు చేశాడు. ఇప్పుడు అదే ఫీట్‌ను మరోసారి పునరావృతం చేశాడు. ఈసారి టీ20ల్లో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

టీ20ల్లో మలింగకు ఇది రెండో హ్యాట్రిక్

టీ20ల్లో మలింగకు ఇది రెండో హ్యాట్రిక్

మలింగ దెబ్బకు చివరి టీ20లో శ్రీలంక 37 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాటు... సొంతగడ్డపై తన కెప్టెన్సీలో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ కాకుండా అతను కాపాడుకోగలిగాడు. అంతర్జాతీయ టీ20ల్లో మలింగకు ఇది రెండో హ్యాట్రిక్ కాగా.. వన్డేల్లో మూడు సార్లు ఈ ఘనత సాధించి పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్(4 హ్యాట్రిక్‌లు; 2 టెస్టుల్లో, 2 వన్డేల్లో)ను అధిగమించాడు.

Story first published: Friday, September 27, 2019, 12:27 [IST]
Other articles published on Sep 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X