న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మయాంక్ అగర్వాల్ త్యాగాన్ని మెచ్చుకున్న అనిల్ కుంబ్లే

mayank agarwal

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ నిన్నటి మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ప్లేఆఫ్‌ రేసులో తన ఆశలను సజీవంగా ఉంచుకున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీపై 54పరుగుల తేడాతో గెలిచిన పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరవ స్థానానికి చేరుకుంది. భారీ తేడాతో గెలవడంతో ఆ జట్ట్టు పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపర్చుకోవడమే కాకుండా తన నెట్ రన్ రేట్ ను కూడా భారీగా పెంచుకుంది. ఈ విజయం అనంతరం పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్లో రావడంతో మంచి ఫలితం వచ్చిందన్నాడు. జట్టు కోసం జానీ బెయిర్‌స్టోను ఓపెనర్‌గా పంపించి కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ నంబర్ 5లో రావడాన్ని కుంబ్లే ప్రశంసించాడు.

ఈ సీజన్లో అత్యధిక పవర్ ప్లే స్కోరు

ఈ సీజన్లో అత్యధిక పవర్ ప్లే స్కోరు

మయాంక్ గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్లో విజయవంతమైన ఓపెనర్లలో ఒకడిగా పేరొందాడు. ఈ సీజన్ ప్రారంభంలో అతను పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ పవర్‌ప్లేలో పరుగులు ఎక్కువ రావాలనే నిర్ణయం మేరకు మయాంక్ తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకుని దిగువ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన ఇష్టమైన ఓపెనింగ్ స్పాట్ ను త్యాగం చేసి బెయిర్ స్టోకు ఆర్సీబీ మ్యాచ్‌లో అప్పజెప్పాడు. దీంతో శిఖర్ ధావన్‌తో కలిసి బెయిర్‌స్టో ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌కు దిగాడు. వీరిద్దరు ఓపెనర్లు కేవలం 30బంతుల్లోనే 60పరుగులు చేసి బలమైన పునాది వేశారు. అనంతరం 6ఓవర్లకు జట్టు పవర్‌ప్లే ముగిసేసరికి 84పరుగుల భారీ స్కోరు వచ్చింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు ఇదే.

 బెయిర్ స్టో అసాధారణ ప్లేయర్

బెయిర్ స్టో అసాధారణ ప్లేయర్

ఆ మ్యాచ్ ముగింపు తర్వాత స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన కుంబ్లే.. మయాంక్ తీసుకున్న నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తూ.. ఆ నిర్ణయం తమ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను పెంచేందుకు దోహదపడిందని పేర్కొన్నాడు. బెయిర్‌స్టో అసాధారణమైన ప్లేయర్. ఇక అతని కోసం టాపార్డర్లో ఇప్పటికే తానెంటో నిరూపించుకున్న మయాంక్ అగర్వాల్.. తన స్థానాన్ని కాదని బెయిర్ స్టోను బరిలోకి దించడం ప్రశంసించదగ్గది. అలాగే.. తాను దిగువ ఆర్డర్లో దిగి జట్టుకు బ్యాటింగ్ లైనప్‌లో సమతూకం తీసుకొచ్చాడని కుంబ్లే మెచ్చుకున్నాడు.

 ఆ ఆర్డర్లో మయాంక్ దిగి సరైన కూర్పునందించాడు

ఆ ఆర్డర్లో మయాంక్ దిగి సరైన కూర్పునందించాడు

లివింగ్ స్టోన్, జితేష్, రిషీ ధావన్ బ్యాటింగ్ ఆర్డర్ల మధ్య ఓ అనుభవజ్ఞుడైన ప్లేయర్ అవసరం కాబట్టి బెయిర్ స్టోను ముందు పంపించి మయాంక్ దిగువ ఆర్డర్లో బరిలోకి దిగి జట్టుకు సరైన కూర్పునందించాడు. అతని నిర్ణయం రీత్యా అంతా మంచే జరిగింది. పవర్‌ప్లేలో జానీ చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలింగ్‌ తుక్కురేగ్గొట్టాడు. జానీ తర్వాత కూడా లివీ అద్భుతంగా రాణించడంతో మాకు మంచి ఫలితం దక్కింది.. అని కుంబ్లే పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో లివింగ్ స్టోన్(42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), జానీ బెయిర్ స్టో(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు పంజాబ్ కింగ్స్ 210పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇకఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది

Story first published: Saturday, May 14, 2022, 16:08 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X