న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్, జడేజా లేకపోతే కుల్దీప్ ఉన్నాడుగా: జట్టు మేనేజ్‌మెంట్‌కు కుంబ్లే

Anil Kumble: India should have been open about injury of Jadeja

హైదరాబాద్: అల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంపై జట్టు మేనేజ్‌మెంట్ స్పందించాలంటూ టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. జడేజా భుజం నొప్పితో బాధ పడుతున్నాడని కోచ్ రవిశాస్త్రి వెల్లడించిన కొద్దిసేపటికే జడేజాకు భుజం సమస్య ముందు నుంచి ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాకు వెళ్లేముందు అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడంటూ బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేయడం అభిమానులను గందరగోళంలో పడేసింది.

తిరగబెట్టిన చేతి వేలి గాయం: బాక్సింగ్ డే టెస్టులో ఆడటంపై ఫించ్ ధీమాతిరగబెట్టిన చేతి వేలి గాయం: బాక్సింగ్ డే టెస్టులో ఆడటంపై ఫించ్ ధీమా

అసలేం జరిగింది?

బాక్సింగ్ డే టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ జడేజా ఆస్ట్రేలియాకు రావడానికి ముందే భుజం నొప్పితో బాధ పడుతున్నాడని వెల్లడించిన సంగతి తెలిసిందే. గాయానికి ఇంజెక్షన్‌ చేయించుకున్నా కోలుకోకపోవడంతోనే పెర్త్‌ టెస్టులో ఆడించలేదని అన్నాడు. 80 శాతం ఫిట్‌నెస్‌ సాధిస్తే.. మెల్‌బోర్న్‌ టెస్టులో జడేజాను ఆడిస్తామని కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

జడేజా గాయంపై కుంబ్లే

జడేజా గాయంపై కుంబ్లే

అటు శాస్త్రి, ఇటు బీసీసీఐ వ్యాఖ్యలపై క్రికెట్ నెక్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ "ప్రత్యర్ధి జట్టుగా ఆస్ట్రేలియా జట్టు ఒకే ఒక్క స్పిన్నర్‌తో అద్భుతమైన ఫలితాలను రాబడుతోంది. భార‌త్‌లో కూడా అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. పిచ్‌తో సంబంధం లేదు. బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా లేనప్పటికీ, స్పిన్నర్ మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. తుది జట్టుని ఎంపిక చేసే సమయంలో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి స్కిల్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించండి. పరిస్థితులకు అనుకూలంగా ఎవరు రాణించగలుగుతారో తెలిసుండాలి. అసలు జట్టు మేనేజ్‌మెంట్ జడేజా గాయాన్ని ఎందుకు ప్రస్తావించలేదో అర్ధం కావడం లేదు. గతంలో నేను కూడా భుజం నొప్పితో బాధపడిన సందర్భాల్లో ఇంజెక్షన్‌ చేయించుకున్నా. దీంతో గాయం నుంచి కోలుకునేందుక కొంత సమయం పడుతుంది" అని కుంబ్లే అన్నాడు.

పెర్త్‌లో కుల్దీప్ యాదవ్‌ని ఎంచుకోకపోవడంపై

పెర్త్‌లో కుల్దీప్ యాదవ్‌ని ఎంచుకోకపోవడంపై

"అశ్విన్, జడేజా ఇద్దరూ గాయాల కారణంగా జట్టుకి అందుబాటులో లేకపోతే నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం అనేది సరైంది కాదు. కుల్దీప్ యాదవ్ రూపంలో జట్టు మేనేజ్‌మెంట్‌కు స్పిన్నర్ ఎందుకు కనిపించలేదు. కుల్దీప్ ఇంకా యువకుడు కావడంతో అతడిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు" అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శనపై

కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శనపై

"కేఎల్ రాహుల్ సమర్ధత గురించి మనకు తెలుసు. అయితే, ఈ సిరిస్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీనికి కారణం అతడి టెక్నిక్ లోపం కాదు, ప్రస్తుం అతడు తన మైండ్‌లో ఏదో డౌట్‌ని కలిగి ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కేఎల్ రాహుల్‌ని ఎక్కువ రోజులు ఆడిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇక, మయాంక అగర్వాల్ ఈ ఏడాది దేశవాళీలో పరుగుల వరద పారించాడు. దీంతో ఈ సిరిస్‌లో అతడికి ఓ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా కేఎల్ రాహుల్ నుంచి జట్టు మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్‌ను కోరుకుంటుంది. టాపార్డర్ బ్యాట్స్‌మన్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ బౌలర్ ఎవరైనా సరే బంతిని క్షుణ్ణంగా పరిశీలించడం లేదని అనిపిస్తోంది. బౌలర్ చేతి నుంచి వచ్చే బంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తే సరి. అది 145 లేదా 150 kmph అయినా సరే" అని అన్నాడు.

మురళీ విజయ్ పరుగులు చేయకపోవడంపై

మురళీ విజయ్ పరుగులు చేయకపోవడంపై

"పెర్త్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ 20 పరుగులు చేశాడు. అతడి ఆట తీరుని చూస్తే అక్కడి పరిస్థితులకు సౌకర్యవంతంగానే కనిపించాడు. మురళీ విజయ గత 15 టెస్టు మ్యాచ్‌లను పరిశీలిస్తే ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఓపెనర్లు పరుగుల సాధించడంలో విఫలమవుతున్నా.. జట్టు మేనేజ్‌మెంట్ ఆ కాంబినేషన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. గతేడాది మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌ని చూస్తే ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. నిజానికి టీమిండియా అడిలైడ్, పెర్త్‌లో జరిగిన రెండు టెస్టుల్లో సైతం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగి చక్కటి ఫలితాలను రాబట్టింది. ఈ సిరిస్‌లో ఓపెనర్ల కాంబినేషన్ ఏమాత్రం సరిలేదు. ఇలాంటి సమయంలో క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతోన్న హనుమ విహారి లాంటి వారికి ఓపెనింగ్ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఆసీస్ పిచ్‌లపై హనుమ విహారి డిఫెన్స్, క్రీజులో పాతుకుపోయిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది" అని కుంబ్లే తెలిపాడు.

Story first published: Monday, December 24, 2018, 13:08 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X