న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ కోచ్‌గా అనిల్‌ కుంబ్లే.. రెండేళ్ల ఒప్పందం!!

IPL 2020 : Anil Kumble Appointed Head Coach Of Kings XI Punjab ! || Oneindia Telugu
Anil Kumble appointed Kings XI Punjab head coach

ముంబై: టీమిండియా మాజీ కోచ్‌, దిగ్గజ ఆటగాడు అనిల్‌ కుంబ్లే మళ్లీ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కుంబ్లేను హెడ్ కోచ్‌గా నియమించినట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ప్రాంచైజీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్‌తో కుంబ్లే రెండేళ్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో వచ్చే సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు హెడ్ కోచ్‌గా కుంబ్లే వ్యవహరించనున్నాడు.

<strong>ఇంగ్లీష్ దినపత్రికపై న్యాయపోరాటానికి దిగిన బెన్‌ స్టోక్స్‌!!</strong>ఇంగ్లీష్ దినపత్రికపై న్యాయపోరాటానికి దిగిన బెన్‌ స్టోక్స్‌!!

పంజాబ్‌ కోచ్‌గా

పంజాబ్‌ కోచ్‌గా

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కోచ్‌గా మైక్‌ హెసెన్‌ ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. హెసెన్‌ ఆధ్వర్యంలో జట్టు విజయాల్లో, ఆటగాళ్ల ప్రదర్శనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పంజాబ్‌ యాజమాన్యం అతడికి ఉద్వాసన పలికింది. హెసెన్‌ స్థానంలో అనిల్‌ కుంబ్లేకు బాధ్యతలు అప్పగించింది. కేవలం ప్రధాన కోచ్‌ను మాత్రమే పంజాబ్ జాయమాన్యం ఎంపిక చేసింది. కుంబ్లేతో సమావేశమయ్యాక.. ఇతర సహాయక సిబ్బందిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం తెలుస్తోంది.

కుంబ్లే నిర్ణయంపైనే అశ్విన్‌ భవిత్యం

కుంబ్లే నిర్ణయంపైనే అశ్విన్‌ భవిత్యం

పంజాబ్ జట్టుకు ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌ను కూడా మార్చాలనే ఉద్దేశంలో పంజాబ్‌ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే కుంబ్లే నిర్ణయంపైనే అశ్విన్‌ భవిత్యం ఆధారపడి ఉంది. త్వరలోనే పంజాబ్‌ కెప్టెన్‌పై ఓ స్పష్టత రానుంది. అశ్విన్‌ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఢిల్లీ మెంటార్ సౌరవ్ గంగూలీ అశ్విన్‌ను జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాడట.

భారత జట్టుకు హెడ్ కోచ్‌గా

భారత జట్టుకు హెడ్ కోచ్‌గా

అనిల్ కుంబ్లే గతంలో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు. ఇక భారత జట్టుకు ఏడాది పాటు హెడ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా కుంబ్లే తన పదవికి రాజీనామా చేసాడు. కుంబ్లే నేతృత్వంలో టీమిండియా విండీస్‌ పర్యటనలో అద్భుతంగా రాణించింది. స్వదేశంలోనూ 2016-2017 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. అయితే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో పాక్‌ చేతిలో టీమిండియా ఓడిపోయిన అనంతరం రాజీనామా చేసాడు.

ఐపీఎల్‌లో తొలి సారిగా కోచ్‌ అవతారం

ఐపీఎల్‌లో తొలి సారిగా కోచ్‌ అవతారం

టీమిండియా కోచ్‌ పదవి నుంచి వైదొలిగాక కుంబ్లే మరెక్కడా కోచ్‌గా పనిచేయలేదు. ఇప్పుడు ఐపీఎల్‌లో తొలి సారిగా కోచ్‌ అవతారం ఎత్తనున్నాడు. కుంబ్లే 132 టెస్టుల్లో 619, 271 వన్డేల్లో 337 వికెట్లు సాధించాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కుంబ్లే ఉన్నాడు.

Story first published: Friday, October 11, 2019, 16:00 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X