న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్‌లో మాథ్యూస్‌ తొలి డబుల్‌ సెంచరీ.. విజయం దిశగా శ్రీలంక!!

Angelo Mathews maiden double ton puts Sri Lanka in control vs Zimbabwe


హరారే:
రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ కోసం జింబాబ్వేలో శ్రీలంక పర్యటిస్తోంది. హరారే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఎంజెలో మాథ్యూస్‌ డబుల్‌ సెంచరీ చేసాడు. 468 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్‌లతో ద్విశతకం చేసాడు. మాథ్యూస్‌కు టెస్టు కెరీర్‌లో ఇది తొలి డబుల్‌ సెంచరీ. ఈ టెస్టుకు ముందు 2014లో ఇంగ్లాండ్‌పై చేసిన 160 పరుగులే అత్యధికం. ప్రస్తుతం మాథ్యూస్‌ ఖాతాలో 10 టెస్ట్ సెంచరీలు ఉన్నాయి.

శుభ్‌మన్‌ గిల్‌ను ఎప్పుడు కెప్టెన్‌ చేస్తారు.. నెటిజన్‌కు షారుఖ్‌ ఫన్నీ రిప్లై!!శుభ్‌మన్‌ గిల్‌ను ఎప్పుడు కెప్టెన్‌ చేస్తారు.. నెటిజన్‌కు షారుఖ్‌ ఫన్నీ రిప్లై!!

ఎంజెలో మాథ్యూస్‌ 84 టెస్ట్ మ్యాచులలో 5, 704 పరుగులు చేసాడు. ఇందులో 10 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 214 వన్డేలలో 5, 812 పరుగులు.. 73 టీ20లలో 1,086 పరుగులు సాధించాడు. వన్డేలలో 139, టీ20లలో 81 అత్యధిక స్కోర్. అన్ని ఫార్మాట్‌లలో కలిపి మాథ్యూస్‌కు కెరీర్‌లో ఇదే తొలి డబుల్ సెంచరీ.

మాథ్యూస్‌ డబుల్‌ సెంచరీ చేయడంతో తొలి టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 519 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో శ్రీలంక 157 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే.. నాలుగో రోజైన బుధవారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ప్రిన్స్‌ మస్వౌరే (15 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), బ్రియాన్‌ ముద్జింగన్‌యమ (14 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 295/4తో బుధవారం ఉదయం ఆట కొనసాగించిన శ్రీలంకను ఎంజెలో మాథ్యూస్‌ ముందుకు నడిపించాడు. ధనంజయ డిసిల్వా (63; 7 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 98 పరుగులు, డిక్వెల్లా (63; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 136 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే మాథ్యూస్‌ 272 బంతుల్లో సెంచరీ, 468 బంతుల్లో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 148 ఓవర్లలో 358 పరుగులు చేసింది. మస్వౌరే (55), కెవిన్ కసుజా (63), క్రెయిగ్ ఎర్విన్ (85) హాఫ్ సెంచరీలతో రాణించారు. లసిత్ ఎంబల్డెనియా 5 వికెట్లు తీసాడు. చివరి రోజు లంక త్వరగా జింబాబ్వేను ఆలౌట్ చేస్తే.. విజయం సాధించే అవకాశం ఉంది. మరి లంక బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ జింబాబ్వే బ్యాట్స్‌మన్‌ తొలి ఇన్నింగ్స్‌లో లాగా రెచ్చిపోతే మ్యాచ్ 'డ్రా' అయ్యే ఆవకాశం ఉంది.

Story first published: Thursday, January 23, 2020, 13:46 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X