న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ వివాదం తాగుబోతుని చేసింది, గిల్టీగా ఫిలయ్యా: ఆండ్రూ సైమండ్స్

Andrew Symonds reveals how monkeygate led to his alcohol problem

హైదరాబాద్: మంకీ గేట్‌ వివాదం క్రికెట్ అంటే పరిచయం ఉన్న అభిమానులకు ఎంతగానో సుపరిచితం. భారత సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. 2008 సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు సందర్భంగా చోటు చేసుకున్న ఈ వివాదాన్ని తాజాగా ఆండ్రూ సైమండ్స్‌ మరోసారి స్పందించాడు.

మంకీ గేట్ వివాదం నన్ను తాగుబోతుని చేసింది

మంకీ గేట్ వివాదం నన్ను తాగుబోతుని చేసింది

ఈ వివాదం తనను ఓ తాగుబోతుని చేసిందని, దీంతోనే తన జీవితం నాశనమైందని అప్పటి సంఘటనను గుర్తుచేస్తూ ఆండ్రూ సైమండ్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఆస్ట్రేలియన్ బ్రాండ్ కాస్టింగ్ కార్పోరేషన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆండ్రూ సైమండ్స్ మాట్లాడుతూ "ఆ వివాదంతో నేను ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోడం మొదలు పెట్టాను. దీంతో నా కెరీర్‌ కూడా నాశనమవడం ప్రారంభమైంది" అని అన్నాడు.

తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను

తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను

"ఆ ఘటనతో నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. ఈ వివాదంపై నేను డీల్‌ చేసిన విధానం కూడా సరైంది కాదు. చాలా గిల్టీగా ఫిలయ్యా. ఇక చాలా సార్లు హర్భజన్‌ నన్ను దూషించాడు. భారత్‌లోనే నన్ను మంకీ అని పిలిచాడు. ఈ విషయంపై నేను అతని డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లి మరి మాట్లాడాను. అలా పిలవడం ఆపకపోతే పెద్ద సమస్య అవుతోందని చెప్పా" అని అప్పటి ఘటనను గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు.

2009లో ఆస్ట్రేలియా తరుపున చివరి మ్యాచ్ ఆడిన సైమండ్స్

2009లో ఆస్ట్రేలియా తరుపున చివరి మ్యాచ్ ఆడిన సైమండ్స్

2009లో ఆస్ట్రేలియా జట్టు తరుపున చివరి మ్యాచ్‌ ఆడిన సైమండ్స్‌ ఆ తర్వాత చాలా సార్లు జట్టు నిబంధనలు అతిక్రమించడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా అతని కాంట్రాక్టును పూర్తిగా రద్దు చేసింది. మరోవైపు సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో హర్భజన్‌ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది.

హర్భజన్‌పై మూడు టెస్టు మ్యాచ్‌ల నిషేధం

హర్భజన్‌పై మూడు టెస్టు మ్యాచ్‌ల నిషేధం

దీంతో మ్యాచ్ రిఫరీ హర్భజన్‌పై మూడు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించాడు. అయితే ఈ వివాదంలో హర్భజన్ సింగ్ తప్పులేదని అప్పటి భారత్‌ ఆటగాళ్లు స్పష్టం చేశారు. సచిన్ టెండూల్కర్ సైతం భజ్జీవైపు మాట్లాడటం విశేషం. అంతేకాదు భజ్జీపై విధించిన నిషేధం ఎత్తేయకపోతే సిరీస్‌ నుంచి తప్పుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ భజ్జీ శిక్షను రద్దు చేయడం విశేషం.

Story first published: Friday, November 2, 2018, 17:12 [IST]
Other articles published on Nov 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X