అతను ఓ ప్రత్యేకమైన ఆటగాడు: దినేశ్‌ కార్తీక్‌

IPL 2019 : Andre Russell Is Like A ‘Superhero’, He Is Best Player Says Dinesh Karthik || Oneindia

ఆండ్రీ రసెల్‌ ఓ ప్రత్యేకమైన ఆటగాడు. ప్రశాంతంగా ఆడుతూ క్రీజులో చివరి వరకూ ఉండటానికి ప్రయత్నిస్తాడు. అదే జట్టు విజయానికి దోహదపడుతుంది అని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ అన్నారు. ఆదివారం రాత్రి ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.

ఫిట్ నెస్ చాలా ముఖ్యం:

ఫిట్ నెస్ చాలా ముఖ్యం:

మ్యాచ్ అనంతరం కోల్‌కతా కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ... 'క్రికెట్‌లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అయినా చివరికి మనం అనుకున్నదని చేసి చూపించాలి. టీ20 ఫార్మాట్‌లో భారీ షాట్లు ఆడాలంటే ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యం. ఆ విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. ఇది ఒక ఆట, ఫలితం ఎలా ఉన్నా చివరకు చిరునవ్వుతో ఉండాలి. ఇది జట్టులో మంచి వాతావరణం నింపుతుంది' అని కార్తీక్‌ తెలిపారు.

పాండ్య బాగా బ్యాటింగ్‌ చేశాడు:

పాండ్య బాగా బ్యాటింగ్‌ చేశాడు:

'ఇది బ్యాటింగ్‌ వికెట్‌. బంతి నేరుగా బ్యాట్‌పైకి వస్తుంది. హార్దిక్‌ పాండ్య బాగా బ్యాటింగ్‌ చేశాడు. ఇలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించడం అంత సులువు కాదు. అయినా మా బౌలర్లు సఫలమయ్యారు. ఇలాంటి ఛేదనలో బ్యాట్స్‌మెన్‌ చెత్త షాట్ ఆడే వరకు ఓపిక పట్టాలి. అప్పుడే ఒత్తిడిని జయిస్తాం' అని కార్తీక్‌ పేర్కొన్నారు.

సెల్‌ ప్రత్యేకమైన ఆటగాడు:

సెల్‌ ప్రత్యేకమైన ఆటగాడు:

'ఆండ్రీ రసెల్‌ ఓ ప్రత్యేకమైన ఆటగాడు. ప్రశాంతంగా ఆడుతూ క్రీజులో చివరి వరకూ ఉండటానికి ప్రయత్నిస్తాడు. అదే జట్టు విజయానికి దోహదపడుతుంది. ఆటపై అతను చూపించే పరిపక్వత అమోగం. వచ్చే మ్యాచుల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తాం. అభిమానుల మద్దతు బాగుంది' అని దినేశ్‌ కార్తీక్‌ చెప్పుకొచ్చారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, April 29, 2019, 11:40 [IST]
Other articles published on Apr 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X