చెలరేగిన ఆమ్లా, పెరీరా: రెండో టీ20లో వరల్డ్‌ ఎలెవెన్‌‌దే విజయం

Posted By:

హైదరాబాద్: ఇండిపెండెన్స్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో తొలి మ్యాచ్‌ను చేజార్చుకున్న వరల్డ్ ఎలెవన్... రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిసీస్‌ను 1-1తో సమం చేసింది.

పాక్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఆమ్లా(72 నాటౌట్, 5 ఫోర్లు, 2సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీకి తోడు చివర్లో తిసార పెరీరా(47 నాటౌట్, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

Amla, Perera power World XI to 7-wicket win over Pakistan, level series 1-1

అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (43)తో పాటు బాబర్ అజామ్ (45), షోయబ్ మాలిక్ (39) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. వరల్డ్ ఎలెవన్ బౌలర్లలో బద్రీ, పెరీరా చెరో రెండు వికెట్లు తీశారు.

పాకిస్థాన్ నిర్దేశించిన 175 లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే వరల్డ్ ఎలెవన్ చేధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అద్భుత ప్రదర్శన చేసిన తిసార పెరీరాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిర్ణయాత్మక మూడో టీ20 శుక్రవారం లాహోర్ జరగనుంది.

Story first published: Thursday, September 14, 2017, 11:41 [IST]
Other articles published on Sep 14, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి