న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేల్లో 5000 పరుగులు: ఆమ్లా, కోహ్లీల సరసన విలియమ్సన్

By Nageshwara Rao
Amla, Kohli, Williamson and the quickest players to 5,000 ODI runs

హైదరాబాద్: వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భాగంగా ఐదువేల పరుగులు పూర్తి చేసిన విలియమ్సన్.. న్యూజిలాండ్ తరపున అతివేగంగా ఈ రికార్డు అందుకున్న తొలి క్రికెటర్‌‌గా చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఓవర్ చివరి బంతిని విలియమ్సన్ బౌండరీకి తరలించి ఐదువేల పరుగులు పూర్తిచేశాడు.

50 ఓవర్ల క్రికెట్లో వెస్టిండీస్ క్రికెటర్ గ్రీనిడ్జ్ (121 ఇన్నింగ్స్‌లు)ను అధిగమిస్తూ అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాళ్లు వీరే.

వన్డేల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్లు:
* హషీం ఆమ్లా - 101 (104 మ్యాచ్‌లు)
* వివ్ రిచర్డ్స్ - 114 (126 మ్యాచ్‌లు)
* విరాట్ కోహ్లి - 114 (120 మ్యాచ్‌లు)
* బ్రియాన్ లారా - 118 (120 మ్యాచ్‌లు)
* కేన్ విలియమ్సన్ - 119 (125 మ్యాచ్‌లు)
* గ్రీనిడ్జ్ - 121 (122 మ్యాచ్‌లు)

ఇదిలా ఉంటే శనివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ 50 ఓవర్లలో 230/8 స్కోరుకు పరిమితమైంది.

కెప్టెన్ విలియమ్సన్(112 నాటౌట్) అజేయ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా జట్టుని గెలిపించలేకపోయాడు. ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఓ దశలో 103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను విలియమ్సన్, సాంట్నర్(41) గాడిలో పడేశారు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు.

అయితే ఆఖరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమైన దశలో కివీస్.. క్రిస్ వోక్స్ అద్భుతమైన బౌలింగ్‌తో 10 పరుగులే చేసి ఓటమి పాలైంది. స్పిన్నర్లు మొయిన్ అలీ(3/36), రషీద్(2/34) రాణించారు. తొలుత కెప్టెన్ మోర్గాన్(48), స్టోక్స్(39) బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Sunday, March 4, 2018, 9:24 [IST]
Other articles published on Mar 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X