న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాయుడి అనుభవం భారత జట్టుకి లాభించనుంది: లక్ష్మణ్ ప్రశంస

Ambati Rayudus reliability and explosiveness massive positive: VVS Laxman

హైదరాబాద్: భారత జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్న అంబటి రాయుడు నెం.4 స్థానంలో నిలకడగా రాణించి మిడిలార్డర్ సమస్యను తీర్చాడని మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి నెం.4 స్థానంలో ఆడుతున్న అంబటి రాయుడి బాధ్యతలు అందరితో పోలిస్తే చాలా ప్రత్యేకం అని చెప్పాడు.

<strong>ఇమ్రాన్ తాహిర్ అత్యుత్సాహం: నెటిజన్ల ఎగతాళి! (వీడియో)</strong>ఇమ్రాన్ తాహిర్ అత్యుత్సాహం: నెటిజన్ల ఎగతాళి! (వీడియో)

ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రాయుడు 72.33 యావరేజితో మొత్తం 217 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయుడి బ్యాటింగ్ ప్రదర్శనపై లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

అంతేకాదు వచ్చే ఏడాది వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో నెం.4 స్థానంలో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ దొరకడం భారత్ జట్టుకి గొప్ప ఉపశమనమని చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో రాయుడి అనుభవం టీమిండియాకి ఎంతో లాభించనుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో లక్ష్మణ్

టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో లక్ష్మణ్

శనివారం టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో లక్ష్మణ్ "దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్, ఆ తర్వాత వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అంబటి రాయుడు నిలకడగా రాణించాడు. వాస్తవానికి నెం.4 బ్యాటింగ్ స్థానం జట్టులో చాలా ప్రత్యేకం" అని అన్నాడు.

 బ్యాట్స్‌మెన్‌కి స్ట్రైక్‌ని రొటేట్ చేయగలగాలి

బ్యాట్స్‌మెన్‌కి స్ట్రైక్‌ని రొటేట్ చేయగలగాలి

"ఎందుకంటే, అప్పటికే క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌కి స్ట్రైక్‌ని రొటేట్ చేయగలగాలి. ఒకవేళ ఆ బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడుతుంటే తనే బాధ్యత తీసుకుని హిట్టింగ్‌తో స్కోరు బోర్డుని నడిపించాలి. అంబటి రాయుడు ఈ రెండు బాధ్యతల్ని వెస్టిండీస్‌తో సిరీస్‌లో చక్కగా నిర్వర్తించాడు" అని లక్ష్మణ్ తెలిపాడు.

 స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్లు

స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్లు

"స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్లు ఆడాడు. అదేవిధంగా పేసర్ల బౌలింగ్‌లో కుదురుగా క్రీజులో నిలబడి పరుగులు రాబట్టాడు. 2013లోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా.. రాయుడి అనుభవం టీమిండియాకు రాబోయే రోజుల్లో కలిసి రానుంది" అని అన్నాడు.

 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు

10 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు

ఇటీవలే దుబాయి వేదికగా ముగిసిన ఆసియా కప్ ద్వారా అంబటి రాయుడు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో టీమిండియా టైటిల్ విజేతగా నిలవడంతో రాయుడు కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు మొత్తం 10 ఇన్నింగ్స్‌లాడిన రాయుడు ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం తొలి టీ20

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం తొలి టీ20

భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ముగిసిన తర్వాత మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరగనుంది.

Story first published: Saturday, November 3, 2018, 16:18 [IST]
Other articles published on Nov 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X