న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాంకాంగ్‌తో మ్యాచ్: వారిద్దరే కీలకమన్న కెప్టెన్ రోహిత్ శర్మ

Asia Cup 2018 : kedar Jadhav & Ambati Rayudu Are Important To Team Says Rohit Sharma
 Ambati Rayudu and Kedar Jadhav Are Important Members of the Team: Rohit Sharma

హైదరాబాద్: భారత జట్టులో ఆ ఇద్దరూ కీలక ఆటగాళ్లు అని అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లను ఉద్దేశించి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా మంగళవారం రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా దుబాయిలోని అంతర్జాతీయ స్టేడియంలో హాంకాంగ్‌తో తలపడనుంది.

మ్యాచ్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ "వన్డే జట్టులోకి అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లు వచ్చేశారు. ఆ ఇద్దరూ కీలక ప్లేయర్లు. రాయుడు, జాదవ్‌లు తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. ఆ ఇద్దరూ అద్భుత ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా" అని రోహిత్ శర్మ తెలిపాడు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ

ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడుతుండగా... ఆ తర్వాతి రోజైన బుధవారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు దుబాయిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. వర్క్‌లోడ్, రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

తొలి మ్యాచ్‌లో నెగ్గి టోర్నీని విజయంతో

హాంకాంగ్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌లో నెగ్గి టోర్నీని విజయంతో ఆరంభించాలని టీమిండియా ఊవిళ్లూరుతోంది. మరోవైపు పాక్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన హాంకాంగ్ కనీసం రెండో మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటోంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

రోహిత్ శర్మ సారథ్యం వహించడంతో జట్టుపై భారీ అంచనాలు

రోహిత్ శర్మ సారథ్యం వహించడంతో జట్టుపై భారీ అంచనాలు

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారిగా రోహిత్ శర్మ సారథ్యం వహించడంతో జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రికెట్ అనుభవం అంతగా లేని హాంకాంగ్ జట్టుపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని రోహితే సేన తహతహలాడుతోంది.

పాక్ చేతిలో చిత్తుగా ఓడిన హాంకాంగ్

పాక్ చేతిలో చిత్తుగా ఓడిన హాంకాంగ్

మరోవైపు అన్షే ఖాన్ నాయకత్వంలోని హాంకాంగ్ జట్టు పాకిస్థాన్‌తో జరిగిన తొలి గ్రూప్-ఏ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్-హాంకాంగ్ జట్ల మధ్య ఇప్పటిదాకా ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టే విజయం సాధించింది. దీంతో ఇప్పుడు కూడా టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Story first published: Monday, September 17, 2018, 17:22 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X