న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మోస్ట్ సక్సెస్‌పుల్ టెస్టు బ్యాట్స్‌మన్: అనూహ్యంగా టెస్టుల్లోకి కుక్ అరంగేట్రం

By Nageshwara Rao
Alastair Cook to retire- a look at the career of Englands most successful Test batsman

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ సోమవారం ప్రకటించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా సెప్టెంబర్ 7(శుక్రవారం) నుంచి భారత్‌తో మొదలయ్యే చివరి టెస్టే తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ అని కుక్ ప్రకటించాడు.

అయితే, అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అలెస్టర్ కుక్ అరంగేట్రం అనూహ్యంగా జరిగింది. 2006లో భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ట్రెస్కోథిక్‌ వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో తప్పుకున్నాడు. దీంతో ఓపెనర్‌గా అలెస్టర్ కుక్‌కి పిలుపు వచ్చింది. ఆ సమయంలో ఎక్కడో విండిస్ పర్యటనలో ఉన్న కుక్ సుదూరం ప్రయాణం చేసి భారత గడ్డపై తన తొలి టెస్టు మ్యాచ్‌ని ఆడాడు.

తన అరంగేట్ర మ్యాచ్‌లో 60, 104 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు కుక్‌ బ్యాట్‌ నుంచి జాలువారాయి. ఏడాదికి వెయ్యి పరుగుల చొప్పున 12 ఏళ్ల కెరీర్‌లో 12 వేలకు పైగా పరుగులతో టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలనందించాడు.

1
42377
ప్రతికూల పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా

ప్రతికూల పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా

ప్రతికూల పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా మరల్చుకుని కోల్‌కతాలో భారత్‌పై చేసిన 190, సిడ్నీలో ఆస్ట్రేలియాపై 189, లార్డ్స్‌లో న్యూజిలాండ్‌పై 162, గాలేలో శ్రీలంకపై 118, డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై చేసిన 118 పరుగులు కుక్‌ టెస్టు కెరీర్‌లోనే ఆణిముత్యాలు. ఏకంగా 766 పరుగులు సాధించి 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్‌ సిరీస్‌ (2010-11)ను గెలిపించాడు. కుక్ టెస్టు కెరీర్‌లోనే ఇదొక అద్భుతమైన ఘట్టం. కెప్టెన్‌గా 2012లో భారత గడ్డపై 2-1తేడాతో టెస్టు సిరిస్‌ను గెలిచి చరిత్ర సృష్టించాడు. అలాగే 2013-14 యాషెస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 0-5తో చిత్తుగా ఓడటం చేదు జ్ఞాపకం.

భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విఫలం

భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విఫలం

దీంతో 2015 వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు ఇంగ్లాండ్‌ సెలక్టర్లు కుక్‌ను కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా తప్పించారు. ఆ తర్వాత 2016లో భారత్‌లో సిరీస్‌ కోల్పోవడంతో కుక్‌ టెస్టు కెప్టెన్సీ పోయింది. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కూడా విఫలం కావడంతో క్రికెట్ నుంచే పూర్తిగా వైదొలగాడు. గత డిసెంబర్‌లో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో అజేయంగా 244 పరుగులు చేసిన కుక్ అనంతరం ఫామ్‌ని కోల్పోయాడు.

ఓపెనర్‌గానే 10 వేలకు పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌

ఓపెనర్‌గానే 10 వేలకు పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌

ఆ తర్వాత మరో 9 టెస్టులకే కుక్ రిటైర్‌ కావడం దురదృష్టకరం. ఓపెనర్‌గానే 10 వేలకు పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో కుక్ అరుదైన ఘనత సాధించాడు. రిటైర్మెంట్ సందర్భంగా కుక్ మాట్లాడుతూ "రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే అయినా నేను క్రికెట్ కోసం అన్నీ ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. నేను ఎప్పుడూ ఊహించని రికార్డులను సాధించాను. ఇంగ్లండ్ జట్టులో ఇంతకాలంగా నేను ఆడటం ఎంతో సంతోషంగా.. గౌరవంగా ఉంది. ఇక కొందరు జట్టు సభ్యులతో డ్రెస్సింగ్ రూంని పంచుకోలేను అని తెలిసి కాస్త బాధగా ఉంది. కానీ ఇందుకు ఇదే సరైన సమయం" అని కుక్ చెప్పాడు.

క్రికెట్ అంటే ప్రాణం

క్రికెట్ అంటే ప్రాణం

"నేను పిల్లాడిగా మా గార్డెన్‌లో క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి క్రికెట్ అంటే నాకు ప్రాణం. ఇంగ్లండ్ షర్ట్‌ని తీసేయం చాలా కష్టమే.. కానీ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని, యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు దక్కాలనే ఇది చేస్తున్నాను. వాళ్లు మా దేశానికి ప్రతినిధ్యం వహించి మనల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నా'' అని కుక్ తెలిపాడు. ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు తరుపున 160 టెస్టులు ఆడిన కుక్.. 12254 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో కుక్ యావరేది 44.88గా ఉంది. 2016లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అతి చిన్న క్రికెటర్‌గా రికార్డు కుక్ సృష్టించాడు.

Story first published: Tuesday, September 4, 2018, 12:08 [IST]
Other articles published on Sep 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X