న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పిచ్ ఫిక్సింగ్: ఇద్దరిపై నిషేధం విధించిన శ్రీలంక క్రికెట్ బోర్డు

By Nageshwara Rao
Al Jazeera Sting: Sri Lanka Cricket Suspends Two Caught in Pitch-fixing Controversy

హైదరాబాద్: దోహాకు చెందిన 'ఆల్‌ జజీరా' అనే న్యూస్ ఛానల్ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో తాము ఫిక్సింగ్‌ పాల్పడినట్లు ఒప్పుకున్న పిచ్‌ క్యూరేటర్‌, గ్రౌండ్స్‌మన్‌పై వేటు వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. గతేడాది నవంబర్ వేదికగా ఇంగ్లాండ్‌తో గాలే వేదికగా జరిగే టెస్టు మ్యాచ్‌ ఫలితం ప్రభావితమయ్యేలా ఫిచ్‌ను సిద్దం చేస్తామని ఈ ఇద్దరు తెలిపినట్లు స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైంది.

దీంతో ఈ ఘటనకు సంబంధించి శ్రీలంక క్రికెట్‌ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. స్టింగ్‌ ఆపరేషన్‌ చేసిన జర్నలిస్ట్‌ డేవిడ్‌ హారిసన్‌తో కొలంబో ఆటగాడు తరిందు మెండీస్‌, గాలె పిచ్‌ క్యూరేటర్‌ తరంగ ఇండికాలు ఫలితాన్ని ప్రభావం చేసేలా పిచ్‌ను సిద్దం చేస్తామని ఒప్పుకున్నారు.

విచారణలో ఒప్పుకున్న పిచ్‌ క్యూరేటర్‌, గ్రౌండ్స్‌మన్‌

విచారణలో ఒప్పుకున్న పిచ్‌ క్యూరేటర్‌, గ్రౌండ్స్‌మన్‌

అంతకముందు జరిగిన శ్రీలంక-ఆసీస్, భారత్‌-శ్రీలంక టెస్టుల్లో సైతం పిచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వారు అంగీకరించారు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం పిచ్‌ క్యూరేటర్‌, గ్రౌండ్స్‌మన్‌పై వేటు వేసింది. అల్‌జజీరా స్టింగ్‌ ఆపరేషన్‌పై స్పందించిన ఐసీసీ ఆ ఛానల్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ పిచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెలువడడంతో ఐసీసీ చర్యలకు ఉపక్రమించిందని అన్నాడు.

పిచ్ ఫిక్సింగ్ ఎలా వెలుగులోకి వచ్చిందంటే!

పిచ్ ఫిక్సింగ్ ఎలా వెలుగులోకి వచ్చిందంటే!

పిచ్ ఫిక్సింగ్‌పై దోహాకు చెందిన ‘ఆల్‌ జజీరా' అనే న్యూస్ ఛానల్ ‘క్రికెట్స్‌ మ్యాచ్‌ ఫిక్సర్స్‌' పేరిట ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. అందులో గాలేలో 2017, జులై 26 నుంచి 29 వరకు జరిగిన భారత్‌-శ్రీలంక టెస్టు మ్యాచ్‌, రాంచీలో 2017, మార్చి 16-20 మధ్య జరిగిన భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు, చెన్నైలో 2016, డిసెంబర్‌ 16-20 మధ్య జరిగిన భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు గురయ్యాయని పేర్కొంది.

ఈ మూడు టెస్టుల్లో రెండింటిలో భారత్‌ గెలుపొందగా

ఈ మూడు టెస్టుల్లో రెండింటిలో భారత్‌ గెలుపొందగా

ఈ మూడు టెస్టుల్లో రెండింటిలో భారత్‌ గెలుపొందగా.. రాంచీ టెస్టు డ్రాగా ముగిసింది. గతేడాది జూలై 26 నుంచి 29 వరకు గాలే భారత్, శ్రీలంక మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ 304 పరుగుల తేడాతో గెలిచింది. ఇక, రాంచీ టెస్టు పిచ్ ఫిక్సింగ్‌లో కనీసం ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రమేయం ఉందని అందులో పేర్కొంది. ఇక, చెన్నైలో జరిగిన టెస్టులో ముగ్గురు ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల ప్రమేయం ఉన్నట్లు తమ స్టింగ్‌ ఆపరేషన్‌లో తేలిందని చెప్పింది. అయితే ఈ ఆరోపణలను ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఖండించగా.. ఆసీస్‌ ఆటగాళ్లు ఇంకా స్పందించలేదు.

 పిచ్ క్యూరేటర్‌కు ముడుపులు

పిచ్ క్యూరేటర్‌కు ముడుపులు

ముంబైకి చెందిన ఫస్ట్ క్లాస్‌మాజీ క్రికెటర్ రాబిన్ మోరిస్, శ్రీలంకలోని గాలె పిచ్‌ను మార్పించాడని, అందుకు పిచ్ క్యూరేటర్‌కు ముడుపులు కూడా ఇచ్చినట్లు వెల్లడించింది. గాలె స్టేడియం అసిస్టెంట్‌ మేనేజర్‌, గ్రౌండ్స్‌మన్‌ తరంగ ఇండిక అందుకు సహకరిస్తాడని.. తమని ఫిక్సర్లుగా పరిచయం చేసుకున్న అల్‌జజీరా రిపోర్టర్లతో అతడు చెప్పాడు. 'ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ కోసం బౌలింగ్‌ పిచ్‌ను తయారు చేశా. మ్యాచ్‌లో కచ్చితంగా ఫలితం వచ్చేలా చెత్తగా రూపొందించా. అసలు రోలర్‌ను వాడలేదు. స్పిన్నర్లు విజృంభించిన ఆ మ్యాచ్‌ కేవలం రెండున్నర రోజుల్లో ముగిసింది' అని గ్రౌండ్స్‌మన్‌ తరంగ చెప్పాడు. బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపడతారని ముందే తెలుసుకోవడం ద్వారా భారీగా ఆర్జించొచ్చని మోరిస్‌ చెప్పాడు.

ఎవరీ రాబిన్ మోరిస్

ఎవరీ రాబిన్ మోరిస్

గతేడాది భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ గురించి తరంగ మాట్లాడుతూ 'భారత్‌తో మ్యాచ్‌ కోసం బ్యాటింగ్‌ పిచ్‌ను తయారుచేశాం. రోలర్‌ ఉపయోగించి, ఆ తర్వాత నీళ్లు పోసి పిచ్‌ను గట్టిగా మార్చాం' అని అన్నాడు. ముంబైకి చెందిన రాబిన్ మోరిస్ ఇప్పటి వరకు 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ కంటే ముందు వివాదాస్పద ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

Story first published: Monday, May 28, 2018, 18:42 [IST]
Other articles published on May 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X