న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆయన లేరన్న వార్త.. షాక్‌కు గురయ్యేలా చేసింది'

 Ajit Wadekar passes away: Cricketing fraternity mourns demise of shrewd and tough stalwart of game on Twitter

హైదరాబాద్: టీమిండియా క్రికెట్ దిగ్గజం.. మాజీ కెప్టెన్ ఇక లేరనే వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అజిత్‌ వాడేకర్‌(77) బుధవారం కన్నుమూశారు. వాడేకర్‌ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ట్వీట్ల ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు. చాలా విచారకరమైన వార్త.

1971లో కరేబియన్‌, ఇంగ్లాండ్‌ గడ్డపై వాడేకర్‌ నాయకత్వంలో భారత్‌ టెస్టు సిరీస్‌లు గెలిచింది. భారత్‌కు ప్రాతినిధ్యం, నాయకత్వం వహించిన గొప్ప ఆటగాళ్లలో వాడేకర్‌ ఒకరు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

* క్రికెటర్, కెప్టెన్‌, కోచ్‌, మేనేజర్‌, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. భారత క్రికెట్‌కు నిజంగా గొప్ప సేవకుడు. ఆయన కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి అజిత్‌ వాడేకర్‌ సర్‌

* అజిత్‌ వాడేకర్‌ సర్‌ ఇక లేరన్నది చాలా విచారకరమైన వార్త. 1990ల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలుగులోకి తీసుకువచ్చారు. ఆయనిచ్చిన సలహాలు, సూచనలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇలాంటి కఠినమైన సమయంలో ఆయన కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను

* మాజీ కెప్టెన్ అజిత్‌ వాడేకర్‌ ఇక లేరన్న వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. తన నాయకత్వంలో భారత్‌కు చరిత్రాత్మక విజయాలు అందించారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి. మీ ఆత్మకు శాంతి కలగాలి.

* భారత మాజీ సారథి అజిత్‌ వాడేకర్‌ ఇకలేరు. క్రికెటర్‌గా, కోచ్‌గా, మేనేజర్‌గా, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా వాడేకర్‌ భారత జట్టుకు సేవలు అందించారు. ఆయన లేరన్న వార్తతో మా గుండె బరువెక్కింది.


* వాడేకర్‌ ఇక లేరన్న వార్త విని షాకయ్యాను. వాడేకర్‌.. గొప్ప క్రికెటర్‌, తొలి వన్డే కెప్టెన్‌, విదేశీ గడ్డలపై అద్భుతమైన విజయాలు అందించిన, దూకుడు స్వభావం కలిగిన బ్యాట్స్‌మెన్‌, ఆల్‌రౌండర్‌. అభిమానులకు, ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.

* అజిత్‌ వాడేకర్‌ గొప్ప సారథి. 1971లో భారత్‌కు సారథ్యం వహించి ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ గడ్డలపై అద్భుత విజయాలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

* భారత ఐకానిక్‌ క్రికెటర్‌ అజిత్‌ వాడేకర్‌ ఇక లేరు. ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.

వాడేకర్‌ భారత తొలి వన్డే కెప్టెన్‌. 1971లో వాడేకర్‌ నాయకత్వంలోనే భారత్‌ మొదటిసారి వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌లలో చారిత్రక టెస్టు సిరీస్‌ విజయాలు సాధించింది. ఆ దేశాల్లో సిరీస్‌లు నెగ్గడం భారత జట్టుకు అదే తొలిసారి.

Story first published: Thursday, August 16, 2018, 13:53 [IST]
Other articles published on Aug 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X