న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీని తొలగించడం సరైన నిర్ణయమే'

India vs Westindies 3 rd Odi : Dropping Dhoni From t20 Is The Right Thing : Ajithagarkar | Oneindia
Ajit Agarkar backs selectors move to drop MS Dhoni from Indias T20 squad for Windies, Australia series

హైదరాబాద్: వెస్టిండీస్‌పై భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ తడబాటు వరుసగా మూడో వన్డేలోనూ కొనసాగింది. పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో 11 బంతులు ఎదుర్కొన్న ధోని చేసింది 7 పరుగులే. ఇందులో కనీసం ఒక్క బౌండరీ కూడా లేదు. మైదానంలో వ్యూహాలు రచించడంలో దిట్ట అయినప్పటికీ అతని పేలవ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

తప్పించడం సరైన నిర్ణయమేనని అగార్కర్

తప్పించడం సరైన నిర్ణయమేనని అగార్కర్

టీ20 జట్టు నుంచి మహేంద్రసింగ్ ధోనీని సెలక్టర్లు తప్పించడం సరైన నిర్ణయమేనని మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం సెలక్టర్లు ఇటీవల జట్టుని ప్రకటించగా.. అందులో ధోనీపై వేటు వేశారు. దీంతో.. ఈ మాజీ కెప్టెన్ టీ20 కెరీర్‌ ఇక ముగిసిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.

టీ20ల నుంచి ధోనీని అందుకే తప్పించారా??

ధోనీకి షార్ట్ ఫార్మాట్‌‌లో సుదీర్ఘ అనుభవం

ధోనీకి షార్ట్ ఫార్మాట్‌‌లో సుదీర్ఘ అనుభవం

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా భారత్ జట్టుని విజేతగా నిలిపిన మహేంద్రసింగ్ ధోనీకి ఈ షార్ట్ ఫార్మాట్‌ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎంతలా అంటే.. భారత్ జట్టు ఇప్పటి వరకు మొత్తం 104 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడితే.. ధోనీ ఏకంగా 93 మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్‌గా తుది జట్టులో ఆడాడు. టీ20ల నుంచి ధోనీని తప్పించడంపై తాజాగా అజిత్ అగార్కర్ మాట్లాడాడు.

2020లో టీ20 ప్రపంచకప్ ధోనీ ఆడతాడా

2020లో టీ20 ప్రపంచకప్ ధోనీ ఆడతాడా

‘రెండు సిరీస్‌ల్లో ధోనీని తప్పించినంత మాత్రాన అతని టీ20 కెరీర్ ముగిసినట్లు కాదు అని సెలక్టర్లు అంటున్నారు. కానీ.. వాళ్లు ఎందుకు అలా అన్నారో అర్థం కావడం లేదు. అయితే.. ధోనీని తప్పించడం మాత్రం సరైన నిర్ణయమేని నా అభిప్రాయం. ఎందుకంటే 2020లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అప్పటి వరకు ధోనీ ఆడతాడనే నమ్మకం లేదు. దీనికి తోడు ఇటీవల టీ20 సిరీస్‌ల్లో అతని ప్రదర్శన కూడా ఆశాజనకంగా లేదు. అందుకే.. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌ని జట్టులో సిద్ధం చేసుకునేందుకు సెలక్టర్లు సరైన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారు' అని అజిత్ అగార్కర్ వెల్లడించాడు.

 ఫామ్‌ కోసం ధోనీ తంటాలు

ఫామ్‌ కోసం ధోనీ తంటాలు

2018లో ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లాడిన మహేంద్రసింగ్ ధోని చేసింది 252 పరుగులు మాత్రమే. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా.. ధోనీ 27 పరుగులు మాత్రమే చేశాడు. 2019 ప్రపంచకప్‌కి మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండగా.. ధోనీ ఇంకా ఫామ్‌ కోసం తంటాలు పడుతుండటం సెలక్టర్లకి మింగుడుపడటం లేదు.

Story first published: Monday, October 29, 2018, 9:59 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X