న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్!!

Ajinkya Rahane receives first dose of COVID-19 vaccine in Mumbai

ముంబై: టీమిండియా టెస్ట్ జ‌ట్టు వైస్‌ కెప్టెన్ అజింక్య ర‌హానే క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. 32 ఏళ్ల జింక్స్ త‌న స‌తీమ‌ణి రాధిక‌తో క‌లిసి ముంబైలోని వ్యాక్సిన్ కేంద్రంలో క‌రోనా మొద‌టి డోసు వేయించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ మంగళవారం వాయిదా పడటంతో ఇప్పటికే ముంబైలోని తన ఇంటికి చేరుకున్న ర‌హానే.. శనివారం వాక్సిన్ వేయించుకున్నాడు. ఐపీఎల్ 2021లో రహానే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో వచ్చిన అవకాశాలను జింక్స్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

కేవలం తమ కోసమే కాకుండా.. చుట్టు ఉన్న‌వారి కోసం టీకా వేయించుకున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో అజింక్య ర‌హానే తెలిపాడు. 'నేను, నా సతీమణి రాధిక ధోప‌వ్క‌ర్ ఈరోజు కరోనా వ్యాక్సిన్ మొద‌టి డోసు తీసుకున్నాం. మేము కేవ‌లం మా కోస‌మే కాకుండా, మా చుట్టు ఉన్న‌వారి కోసం టీకా వేయించుకున్నాం. అర్హులైన ప్ర‌తిఒక్క‌రు రిజిస్ట్రేష‌న్ చేసుకుని వ్యాక్సిన్ తీకోవాల‌ని కోరుతున్నాను' అని జింక్స్ ట్వీట్ చేశాడు. రహానే భారత్ తరఫున ఇప్పటివరకు 73 టెస్టులు, 90 వన్డేలు, టీ20లు ఆడాడు.

గురువారం టీమిడియా సీనియర్ ఓపెనెర్ శిఖ‌ర్ ధావ‌న్ కూడా క‌రోనా వ్యాక్సిన్ మొద‌టి డోసు తీసుకున్నవిషయం తెలిసిందే. కరోనా మహమ్మారి సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న యోధులకు ధన్యవాదాలు తెలియజేశాడు. వీలైనంత త్వరగా ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకొని.. వైరస్‌ను ఓడించాలని ధావన్ సూచించాడు. రహానే, ధావన్ ఇద్ద‌రు భాత‌ర జ‌ట్టులోనే కాకుండా.. ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టులో స‌భ్యులు కావ‌డం విశేషం. భారత క్రికెట్ జట్టులో అందరికంటే ముందుగా హెడ్ కోచ్ రవిశాస్త్రి టీకా వేసుకున్నాడు. మార్చి మొదటి వారంలో అతను మొదటి డోస్ తీసుకున్నాడు.

Sachin vs Kohli: సచిన్ మృధుస్వభావి.. కోహ్లీ అలా కాదు! గొప్ప ఉదాహరణ అదే: వెంకటేష్Sachin vs Kohli: సచిన్ మృధుస్వభావి.. కోహ్లీ అలా కాదు! గొప్ప ఉదాహరణ అదే: వెంకటేష్

పలు జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ మంగళవారం నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 29 మ్యాచ్‌లను మాత్రమే నిర్వహించారు. మిగతా మ్యాచులను సరైన సమయం, షెడ్యూల్ బట్టి నిర్వహించనున్నారు. ఇక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఇంగ్లండ్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. రహానేకు చోటు దక్కగా.. ధావన్‌కు నిరాశే ఎదురైంది.

Story first published: Saturday, May 8, 2021, 15:27 [IST]
Other articles published on May 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X