న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌లో డే/నైట్‌కు కోహ్లీ సై.. మరో పింక్ మ్యాచ్‌కు బీసీసీఐ ట్రై

After Virat Kohli ready, decks could be cleared for Day Night Test in Australia

ముంబై: గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో డేనైట్‌ టెస్ట్‌కు ససేమిరా అన్న టీమిండియా.. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆసీస్ ఎంత కన్విన్స్ చేసిన ఒప్పుకోని భారత్.. కెప్టెన్ విరాట్ కోహ్లీ సుముఖత వ్యక్తం చేయడంతో మరో డేనైట్ మ్యాచ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అన్ని కుదిరితే భవిష్యత్తు పర్యటనలో ఇరు జట్ల మధ్య ఫ్లడ్ లైట్స్ వెలుగులో పింక్ బాల్ మ్యాచ్ జరగనుంది.

పింక్ బాల్‌తో తమ ఆటగాళ్లకు ప్రాక్టీస్ లేదని, పైగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన టోర్నీల్లో ఎదురైన సమస్యలు, ప్లేయర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ డెనేట్ మ్యాచ్‌లను బీసీసీఐ వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే బీసీసీఐ పగ్గాలందుకున్న సౌరవ్ గంగూలీ.. కెప్టెన్ కోహ్లీని ఒప్పించి బంగ్లాదేశ్‌‌తో పింక్ బాల్ ఆడించడం.. అది కాస్త గ్రాండ్ సక్సెస్ అవడంతో మరో మ్యాచ్ ఆడాలనే భావనకు వచ్చింది. ఈ మ్యాచ్ సక్సెస్‌తో కోహ్లీ సైతం పింక్ బాల్ మ్యాచ్‌ల పట్ల తన దృక్పథాన్ని మార్చుకున్నాడు.

<strong>1st Odi: ఇండియా VS ఆస్ట్రేలియా ప్రివ్యూ , కోహ్లీ కీలక నిర్ణయం!</strong>1st Odi: ఇండియా VS ఆస్ట్రేలియా ప్రివ్యూ , కోహ్లీ కీలక నిర్ణయం!

మాకు మ్యాటరే కాదు..

మాకు మ్యాటరే కాదు..

ఆస్ట్రేలియాలో ఏ స్టేడియంలోనైనా సరే డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రెడీగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇండియాతో డేనైట్ గురించి ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్‌ను గతేడాది ప్రశ్నించగా.. ఈ విషయం కోహ్లీనే అడగాలి. మంచి మూడ్‌లో ఉంటే ఒప్పుకుంటాడేమో అంటూ వెటకారం చేశాడు. ఆవిషయాన్ని సోమవారం కోహ్లీ ముందు ప్రస్తావించగా.. పింక్ బాల్ సవాల్‌కు తాము సిద్ధమేనని తెలిపాడు .

‘పింక్ బాల్ సవాల్ కు మేము రెడీ. మ్యాచ్ గబ్బాలోనా, పెర్త్‌లోనా? అనేది మాకు పెద్ద విషయమే కాదు. డేనైట్ మ్యాచ్.. టెస్ట్ సిరీస్‌పై ఆసక్తి పెంచుతుంది. డే నైట్ టెస్ట్‌లు ఆడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈడెన్ గార్డెన్స్లో మేం ఆడిన పింక్ బాల్ మ్యాచ్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఫార్మా‌ట్‌తో సంబంధం లేకుండా ప్రపంచంలో ఏ టీమ్‌నైనా, ఎక్కడైనా ఓడించే సత్తా మాకుంది.'అని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.

ఆసీస్, ఇంగ్లండ్ బోర్డులతో గంగూలీ భేటీ..

ఆసీస్, ఇంగ్లండ్ బోర్డులతో గంగూలీ భేటీ..

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో అనధికారికంగా సమావేశమయ్యారు. ఐసీసీ తీసుకొచ్చిన ఫోర్ డే టెస్ట్ ప్రతిపాదన, ఫోర్ నేషన్ సూపర్ సిరీస్, డే నైట్ టెస్ట్‌లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై ఇరు జట్లు అధికారిక ప్రకట చేయకపోయినప్పటికీ భారత్-ఆస్ట్రేలియా డేనైట్ మ్యాచ్‌పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ‘ప్రస్తుతానికి డే/నైట్ మ్యాచ్ గురించి ఎలాంటి విధివిధానాలు ఫైనల్ కాకపోయినప్పటికీ.. తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఫ్లడ్ లైట్స్ వెలుగులో పింక్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

India vs Australia: ధావన్, రాహుల్ కోసం కోహ్లీ త్యాగం!

న్యూజిలాండ్ టూర్‌లో డే/నైట్ లేదు..

న్యూజిలాండ్ టూర్‌లో డే/నైట్ లేదు..

ఇండియా అప్‌కమింగ్ న్యూజిలాండ్ టూర్‌లో డే/నైట్ మ్యాచ్ జరిగే చాన్స్ లేదని బీసీసీఐ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో కివీస్ నుంచి ఎలాంటి ప్రపోజల్ రాలేదన్నారు. ఇక 2023 నుంచి టెస్ట్‌లను నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను మెజార్టీ క్రికెటర్లు వ్యతిరేకించడమే కాకుండా ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Tuesday, January 14, 2020, 12:29 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X