Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: ధావన్, రాహుల్ కోసం కోహ్లీ త్యాగం!

Virat Kohli to sacrifice his No 3 slot against Aussies

ముంబై: శ్రీలంకతో టీ20 సిరీస్ గెలిచి ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించిన భారత్.. ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ మొదలుకానుంది. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ముగ్గురు అందుబాటులో ఉండటంతో తుదిజట్టులో ఎవరిని ఆడించాలనే అంశం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.

ఏ ఇద్దరూ బరిలోకి దిగిన మరొకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే ఈ ముగ్గురు బరిలోకి దిగే అవకాశం కూడా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలపడం, అవసరమైతే జట్టు అవసరాల కోసం తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చకుంటానని చెప్పడం చర్చనీయాంశమైంది.

ముగ్గురూ ఆడోచ్చు..

ముగ్గురూ ఆడోచ్చు..

‘ఒక ఆటగాడు ఫామ్‌లో ఉంటే అది జట్టుకు మంచిది. ఎవరైనా అత్యుత్తమ జట్టు ఉండాలనే కోరుకుంటారు. అందులో నుంచి బెస్ట్ కాంబినేషన్స్‌తో బరిలోకి దిగాలనుకుంటారు. రోహిత్, శిఖర్, ధావన్ ఈ మ్యాచ్‌లో ఆడొచ్చు. ఈ నేపథ్యంలో ఎలాంటి సమతూకంతో మైదానంలోకి అడుగుపెడ్తామనే అంశంపైనే ఆసక్తి నెలకొననుంది. 'అని తొలి వన్డే నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ తెలిపాడు.

ఏ ఆర్డరైనా ఓకే..

ఏ ఆర్డరైనా ఓకే..

లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతావా అన్న ప్రశ్నకు ఏ ఆర్డర్‌లోనైనా ఆడేందుకు తనకు అభ్యంతరం లేదన్నాడు.‘నా బ్యాటింగ్ ఆర్డర్‌పై నాకు అభద్రతా భావం లేదు. జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలోనైనా ఆడేందుకు నేను సిద్ధం. ఇక కెప్టెన్‌గా అవసరమైన వేళ జట్టులో ఓ స్థానాన్ని భర్తీ చేసే స్థితిలో ఉండాలి. అది కెప్టెన్ భాధ్యత కూడా. చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు. జట్టును చూసుకోవడమే కెప్టెన్ పని కాదు. అందుబాటులో లేకున్నా జట్టు రాణించేలా క`షి చేయాలి.'కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

ప్రస్తుత సిరీస్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ముంబై వేదికగా మంగళవారం తొలి మ్యాచ్ జరగనుంది. జనవరి 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, జనవరి 19న బెంగళూరులో మూడో మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచులు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఒక్క మ్యాచ్‌కే శాంసన్‌ను తీసేస్తారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

భారత వన్డే జట్టు

భారత వన్డే జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ.

Story first published: Monday, January 13, 2020, 18:10 [IST]
Other articles published on Jan 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+