న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్న్ ట్వీట్‌కు స్టోక్స్ రిప్లై: వరల్డ్‌కప్ ఫైనల్లో కోహ్లీని 'మన్కడింగ్' చేసే అవకాశం వస్తే!

IPL 2019 : I would never ever ever 'Mankad' Kohli:Ben Stokes
 After Shane Warnes Twitter rant, Ben Stokes reveals if he would ever Mankad Virat Kohli

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో తాను బౌలింగ్‌ చేస్తుండగా.. మన్కడింగ్‌ విధానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్‌ చేసే అవకాశం వచ్చినా తాను అలా చేయనని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న బెన్ స్టోక్స్ వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్‌' ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

జోస్ బట్లర్‌ని ‘మన్కడింగ్‌' ఔట్ చేసిన అశ్విన్

జోస్ బట్లర్‌ని ‘మన్కడింగ్‌' ఔట్ చేసిన అశ్విన్

జోస్ బట్లర్‌ని ‘మన్కడింగ్‌' ఔట్ చేసిన పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌ షేన్‌వార్న్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా అశ్విన్‌ తనను నిరాశపరిచాడని షేన్ వార్న్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు వార్న్ తన ట్విట్టర్‌లో ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ ఐపీఎల్‌ నిబంధనలకు లోబడి ఆడాలని అన్నాడు.

అశ్విన్‌కు ఆ బంతి వేసే ఆలోచన లేదు

అశ్విన్‌కు ఆ బంతి వేసే ఆలోచన లేదు

ఆ సమయంలో అశ్విన్‌కు ఆ బంతి వేసే ఆలోచన లేదని.. అందుకే బట్లర్‌ను రనౌట్‌ చేశాడని.. దాన్ని డెడ్‌బాల్‌గా పరిగణించాల్సి ఉండేదని వార్న్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో ఇలాంటివి మంచిది కాదని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ విజయం ఆటగాళ్ల మానసికస్థితిని చెడగొడుతుందని, క్రికెట్‌లో అన్నిటి కంటే క్రీడాస్ఫూర్తే ముఖ్యమని తెలిపాడు.

భావితరాలకు ఆదర్శంగా ఉండాలన్న షేన్ వార్న్

భావితరాలకు ఆదర్శంగా ఉండాలని షేన్ వార్న్ సూచించాడు. అశ్విన్‌ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచాడని.. ఈ ఘటనపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు షేన్ వార్న్ తన మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో పాటు బెన్‌ స్టోక్స్‌ కూడా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అశ్విన్‌లానే ఔట్‌ చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించాడు.

వార్న్ తన ట్విట్టర్‌లో బెన్ స్టోక్స్ పేరుని ప్రస్తావించడంతో

షేన్ వార్న్ తన ట్విట్టర్‌లో బెన్ స్టోక్స్ పేరుని ప్రస్తావించడంతో ట్విట్టర్‌లో స్పందించాడు. "ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతున్న సందర్భంలో విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ చేస్తూ.. నేను బౌలింగ్‌ చేస్తుండగా.. మన్కడింగ్‌ విధానంలో ఔట్‌ చేసే అవకాశం వచ్చినా నేను చేయను. ఎప్పుడు ఎక్కడా అలా చేయను. నా పేరు ప్రస్తావించారు కాబట్టే ఈ వివరణ ఇస్తున్నాను" అని ట్వీట్‌ చేశాడు.

అశ్విన్‌పై తీవ్ర విమర్శలు

అశ్విన్‌పై తీవ్ర విమర్శలు

ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ 'మన్కడింగ్' ద్వారా జోస్ బట్లర్‌ను ఔట్ చేయకుండా ఉండి ఉంటే కింగ్స్‌ పంజాబ్‌ గెలిచి ఉండేది కాదు. అప్పటికే, జోస్ బట్లర్‌ 43 బంతుల్లో 69 పరుగులతో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బట్లర్ ఔట్ తర్వాత ఒత్తిడికి గురైన రాజస్థాన్ రాయల్స్ ఆఖర్లో కేవలం 16 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.

Story first published: Tuesday, March 26, 2019, 17:14 [IST]
Other articles published on Mar 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X