టీ20ల్లో తొలిసారి: ధోని సలహాతో ధోనినే స్టంపౌట్ చేశాడు (వీడియో)

Posted By:

హైదరాబాద్: గువహటి వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలిసారి స్టంపౌట్‌ అయ్యాడు. 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకునేందుకు కేదార్ జాదవ్‌తో కలిసి ధోని నిలకడగా ఆడుతున్నాడు.

ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ధోని (13) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆడమ్‌ జంపా వేసిన 9.5వ బంతికి స్టంపౌట్‌ అయ్యాడు. పదో ఓవర్ నాలుగో బంతిని ముందుకొచ్చి ఆడబోయి బతికిపోయిన ధోని.. ఆ మరుసటి బంతికే మరోకసారి ముందుకొచ్చి వికెట్‌ను సమర్పించుకున్నాడు.

టీ20ల్లో తొలిసారి స్టంపింగ్

తన కెరీర్‌లో 80వ అంతర్జాతీయ టీ20 ఆడుతున్న ధోని ఈ ఫార్మాట్లో తొలిసారి స్టంపింగ్ రూపంలో నిష్క్రమించాడు. ధోని సహచర స్పిన్నర్లకు ఎలాంటి సలహాలిచ్చి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌‌ను అవుట్‌ చేస్తాడో అలాంటి బంతికే అవుటవ్వడం విశేషం. ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణె తరఫున ఆడినప్పుడు జంపాకు ధోని ఇలాంటి సలహాలే ఇచ్చాడు.

కోహ్లీ కూడా డకౌట్‌గా

కోహ్లీ కూడా డకౌట్‌గా

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్‌గా నిష్ర్రమించడం టీ20లో సరికొత్త రికార్డు అయితే, ఇదే ఫార్మాట్‌లో ధోని తొలిసారి స్టంపింగ్‌గా అవుట్ కావడం గమనార్హం. ఈ రెండు కూడా గువహటిలో కొత్తగా నిర్మించిన బర్సపురా స్టేడియంలో చోటు చేసుకోవడం గమనార్హం.

 8 వికెట్ల తేడాతో కోహ్లీసేన ఓటమి

8 వికెట్ల తేడాతో కోహ్లీసేన ఓటమి

ఇక, మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన పూర్తిగా విఫలమైంది. అనంతరం బౌలింగ్‌లో కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకున్న ఆసీస్ ఘన విజయాన్ని సాధించింది.

శుక్రవారం హైదరాబాద్‌లో మూడో టీ20

శుక్రవారం హైదరాబాద్‌లో మూడో టీ20

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 118 పరుగులు చేసిన ఆలౌటైంది. అనంతరం భారత్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్ ఛేదించింది. దాంతో సిరీస్ ఫలితం కోసం హైదరాబాద్‌లో శుక్రవారం జరిగే మూడో టీ 20 వరకూ వేచి చూడాల్సిందే.

Story first published: Wednesday, October 11, 2017, 9:32 [IST]
Other articles published on Oct 11, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి