అఫ్గాన్‌కు మరో షాక్.. దూసుకుపోతోన్న వెస్టిండీస్, జింబాబ్వే

Posted By:
 Afghanistan collapse as Zimbabwe win thriller, Gayle leads West Indies past UAE

హైదరాబాద్: ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఫేవరెట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్‌కు మరో షాక్‌ తగిలింది. గ్రూప్‌-బిలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై జింబాబ‍్వే రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వేనే విజయం వరించింది. జింబాబ్వే 196 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకుని అద్భుతమైన గెలుపును అందుకుంది. ఫలితంగా అఫ్గానిస్తాన్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది.

జింబాబ్వేతో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ 49.3 ఓవర్లలో 194 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అఫ్గానిస్తాన్‌ ఓ దశలో విజయం దిశగా పయనించినా చివర వరకూ పోరాడి ఓటమికి గురైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పరాజయాన్ని కొనితెచ్చుకుంది. అఫ్గాన్‌ ఆటగాళ్లలో రెహ్మత్‌ షా(69), మొహ్మద్‌ నబీ(51) రాణించినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. 156 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయిన అఫ్గాన్‌..మరో 38 పరుగులు చేసి మిగతా వికెట్లను నష్టపోయింది.

జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు సాధించగా, సికిందర్‌ రాజా మూడు వికెట్లతో మెరిశాడు. ఇక బ్రెయిన్‌ విటోరి రెండు వికెట్లు, చతరా వికెట్‌ తీశారు. అంతకముందు బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 43 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్‌ టేలర్‌(89), సికిందర్‌ రాజా(60)లు హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటుకున్నారు.

మరో వైపు వెస్టిండీస్ జట్టు యూఏఈతో తలపడి ఘోర పరాజయాన్ని చవిచూసింది. గేల్ సెంచరీతో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ 60 పరుగుల తేడాతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పై విజయం సాధించింది. ముందుగా వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మర్‌ (93), క్రిస్‌ గేల్‌ (91 బంతుల్లో 123) సెంచరీలతో చెలరేగారు. అనంతరం యూఏఈ 50 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది.

Story first published: Wednesday, March 7, 2018, 12:00 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి