న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వకార్ యునిస్ రికార్డు బద్దలు: చరిత్ర సృష్టించిన ఆప్ఘన్ టీనేజర్

By Nageshwara Rao
Afghan Teen Mujeeb Zadran Becomes Youngest To Claim Five-For In ODIs, Goes Past Waqar Younis

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్‌కు చెందిన స్పిన్నర్ ముజీబ్ జర్డాన్ అరుదైన ఘనత సాధించాడు. జింబాబ్వేతో ప్రస్తుతం జరుగుతోన్న వన్డే సిరిస్‌లో ఐదు వికెట్లు తీశాడు. తద్వారా ఐదు వికెట్ల సాధించిన పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ క్రికెటర్ వకార్ యూనిస్ పేరిట ఉండగా దానిని ఇప్పుడు ముజీబ్ జర్డాన్ బద్దలు కొట్టాడు. వకార్ యూనిస్ 18 ఏళ్ల 164 రోజుల వయసులో ఐదు వికెట్ల హాల్ సాధించాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన నాలుగో వన్డేలో జర్డాన్ 50 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో జర్డాన్ 50 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో జింబాబ్వే 34 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన అప్ఘానిస్థాన్ జట్టు 22 ఓవర్లలోనే పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరిస్‌ను 3-1తో ఆప్ఘనిస్థాన్ సొంతం చేసుకుంది.

కాగా, ముజీబ్‌ జర్డాన్‌ను జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. అండర్-19 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 4 వికెట్లు తీసిన ముజీబ్ అప్ఘాన్‌ను సెమీస్ చేర్చాడు. ఇప్పటి వరకూ 7 వన్డేలాడిన ముజీబ్ జర్డాన్ 18 వికెట్లు తీశాడు.

Story first published: Sunday, February 18, 2018, 14:55 [IST]
Other articles published on Feb 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X