న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గిల్‌క్రిస్ట్ ప్రకారం.. ప్రపంచంలో టాప్ 5 అత్యుత్తమ టీ20 ప్లేయర్లు వీరే..! అందులో టీమిండియా నుంచి ఎవరంటే?

Adam Gilchrist Revealed the Top 5 Current T20 Players, Hardik Is also One Of Them

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్.. టీ20 వరల్డ్ కప్ ముందు ఓ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో టాప్ 5 అత్యుత్తమ ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా కూడా ఒకడని పేర్కొన్నాడు. అతను అన్ని విభాగాల్లో అద్భుతమైన ఆటగాడు అని కొనియాడాడు. హార్దిక్ పాండ్యా 2022లో అత్యుత్తమ ఫామ్ కనబర్చుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ20ల్లో అతని ఫామ్ చాలా బాగుంది. బ్యాటింగ్లోను, బౌలింగ్లోను చాలా వరకు రాణిస్తూ నిఖార్సైన ఆల్రౌండర్‌గా పేరొందుతున్నాడు. పాండ్యా ఫామ్, అతని బ్యాటింగ్ విధానం చూసి గత కొన్ని నెలలుగా చాలా మంది మాజీ ప్లేయర్లు అతన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌తో గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ.. తన టాప్ టీ20 ప్లేయర్ల జాబితాను పేర్కొన్నాడు.

ఒంటి చేత్తో విజయాలందించగల వార్నర్

ఒంటి చేత్తో విజయాలందించగల వార్నర్

గిల్‌క్రిస్ట్ తన టాప్ 5 అత్యుత్తమ ప్రస్తుత టీ20 ప్లేయర్ల జాబితాలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆఫ్ఘన్ స్పిన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌లను కూడా పేర్కొన్నాడు. డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటి చేత్తో విజయాలందించగల సామర్థ్యం వార్నర్ సొంతం. కన్సిస్టెన్సీతో పాటు దూకుడుకు మారుపేరైన వార్నర్ తప్పకుండా రాబోయే టీ20 ప్రపంచకప్‌లో తన హవా చూపించగలడు. ఇక అతను ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైనప్పటికీ.. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు మళ్లీ జట్టులోకి వచ్చాడు.

మ్యాచ్ స్వరూపం మార్చేయగల రషీద్ ఖాన్

మ్యాచ్ స్వరూపం మార్చేయగల రషీద్ ఖాన్

ఇక ఆఫ్ఘన్ స్పిన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్.. ఆ జట్టులో నంబర్ 1 ప్లేయర్. కట్టడిగా బౌలింగ్ చేయడం, మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్ల వికెట్లు కూల్చడం ద్వారా మ్యాచ్ స్వరూపాన్ని మార్చే కెపాసిటీ రషీద్ ఖాన్ సొంతం. ఇక ఇటీవల బ్యాటింగ్లో రషీద్ ఖాన్ చాలా ప్రమాదకరంగా మారాడు. కుదురకుంటే బౌండరీల మోత మోగించగలడు. అందువల్ల అతను గిల్లీ టాప్ 5లో చోటు దక్కించుకోవడం పెద్ద విశేషమేమీ కాదు.

ప్రత్యర్థులకు చుక్కలు చూపించే బట్లర్

ప్రత్యర్థులకు చుక్కలు చూపించే బట్లర్

ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన పని లేదు. ఇటీవల పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ ఆడిన 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కాఫ్ గాయంతో దూరమైన బట్లర్.. మళ్లీ ప్రపంచకప్ టైంకు అందుబాటులోకి రానున్నాడు. ఐపీఎల్లో ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు చేసి ఈ ఏడాది తాను ఎంతటి ప్రమాదకర బ్యాటరో ప్రపంచానికి చూపించాడు. బట్లర్ నిలదొక్కుకుంటే మ్యాచ్ వన్ సైడ్ కావడం ఖాయం.

కన్సిస్టెన్సీకి మారుపేరు బాబర్ ఆజామ్

కన్సిస్టెన్సీకి మారుపేరు బాబర్ ఆజామ్

పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 3వ ర్యాంక్ ప్లేయర్. గత కొన్నాళ్లుగా కన్సిస్టెన్సీకి మారుపేరుగా.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా బాబర్ ఆజామ్ కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటున్నాడు. టీ20 ఫార్మాట్లో బాబర్‌కు మంచి పేరున్నా.. కెప్టెన్సీ విషయంలో మాత్రం అతని పట్ల చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక ఓపెనర్‌గా బాబర్ బరిలోకి దిగకుండా వన్డౌన్లో రావాల్సిన అవసరముందని.. పాక్ మిడిలార్డర్ వైఫల్యాన్ని సెట్ రైట్ చేసేందుకు ఓ స్టాండింగ్ ప్లేయర్ అవసరముందని పాక్ విశ్లేషకులు, మాజీలు కూడా పేర్కొంటున్నారు.

Story first published: Monday, October 3, 2022, 15:52 [IST]
Other articles published on Oct 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X