న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కంట్రాట్స్: వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలు కొట్టిన ధోని

వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. 
 ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

By Nageshwara Rao

హైదరాబాద్: వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా విండిస్‌తో జరిగిన మూడో వన్డేలో ధోని తన కెరీర్‌లో 63వ అర్ధసెంచరీని నమోదు చేశాడు.

16 ఏళ్ల తర్వాత: వన్డేల్లో ధోని అత్యంత 'చెత్త' రికార్డు 16 ఏళ్ల తర్వాత: వన్డేల్లో ధోని అత్యంత 'చెత్త' రికార్డు

ఈ మ్యాచ్‌లో ధోని 78 పరుగులతో అద్భుతమైన అర్ధ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ధోని... ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ రికార్డుని అధిగమించాడు. తాజా అర్ధసెంచరీతో ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ కీపర్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో రెండో స్ధానంలో నిలిచాడు.

Adam Gilchrist congratulates MS Dhoni on surpassing his record as wicketkeeper-batsman

13341 పరుగులతో శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ 9410 పరుగులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అయితే విండిస్ పర్యటనలో ధోని అర్ధసెంచరీ బాదడంతో 9496 పరుగులతో గిల్‌క్రిస్ట్‌ని అధిగమించి రెండో స్ధానంలో నిలిచాడు.

తన రికార్డుని అధిగమించినందుకు గాను ధోనికి ఇనిస్టాగ్రామ్ ద్వారా గిల్ క్రిస్ట్ అభినందనలు తెలిపాడు. 'నన్ను అధిగమించినందుకు అభినందులు. ఎల్లప్పుడూ సమయమే నిర్ణయిస్తుంది' అని గిల్ క్రిస్ట్ క్యాప్షన్ పెట్టాడు. 45 ఏళ్ల గిల్‌క్రిస్ట్ ఆసీస్ తరుపున 282 మ్యాచ్‌లకు వికెట్ కీపర్‌గా ఉన్నాడు.

9410 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 53 అర్ధసెంచరీలు ఉన్నాయి. తన 12 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఆస్ట్రేలియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా డెక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరుపున ఆడాడు.

Congrats on passing me young fella. Was always a matter of time. #msd #2ndhighest #keepers

A post shared by Adam Gilchrist (@gilly381) on

ఇదిలా ఉంటే ధోని కూడా తన 13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 10 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు చేశాడు. ఇటీవలే వన్డేల్లో 200 బాదిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డుని కూడా సృష్టించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X