న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్

Achievement! Holder Pips Akhtar, Hadlee to Break a 100-Year Old Record

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. గాయం కారణంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరమైన జాసన్ హోల్డర్.. రెండో టెస్ట్‌కు టీమ్‌లోకి వచ్చాడు.

తొలి ఇన్నింగ్స్‌లో జాసన్ హోల్డర్ ఐదు వికెట్లతో రాణించాడు. ఈ ఏడాది హోల్డర్ ఐదు వికెట్లు అంతకన్నా ఎక్కువ తీసుకోవడం ఇది ఐదోసారి. ఈ ప్రదర్శనతో గత వందేళ్లలో ఏ బౌలర్‌కూ సాధ్యం కాని రికార్డు సాధించాడు. ఈ ఏడాది 11.87 సగటుతో 33 వికెట్లు తీసుకున్నాడు.

జాసన్ హోల్డర్ రికార్డు గురించి ఐసీసీ ప్రత్యేకంగా ట్వీట్

గ‌తంలో పాక్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ 12.83 స‌గ‌టుతో 30 వికెట్లు తీసుకున్నాడు. క‌నీసం 30 వికెట్లు తీసుకున్న బౌల‌ర్ల‌లో ఇంత త‌క్కువ స‌గ‌టు మ‌రే బౌల‌ర్‌కూ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో జాసన్ హోల్డర్ రికార్డు గురించి ఐసీసీ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. దీంతో ఒక కేలండర్ ఇయర్‌లో నాలుగు అంతకన్నా ఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసిన విండీస్ బౌలర్లలో హోల్డర్ రెండో వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు.

గతంలో కౌర్ట్నీ వాల్ష్ పేరిట ఈ రికార్డు

గతంలో కౌర్ట్నీ వాల్ష్ పేరిట ఈ రికార్డు ఉండేది. హోల్డర్ ఇప్పటివరకు 34 టెస్టులు, 80 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే, భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ జట్టు 127 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 72 పరుగుల విజయ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఆటలో భాగంగా ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు చుక్కలు చూపించారు.

విండిస్‌కు షాకిచ్చిన ఉమేశ్ యాదవ్

విండిస్‌కు షాకిచ్చిన ఉమేశ్ యాదవ్

రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే పేసర్ ఉమేశ్ యాదవ్ విండీస్‌కు ఊహించని షాకిచ్చాడు. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం మరో ఓపెనర్ కీరన్ పావెల్‌ను ఔట్ చేసిన స్పిన్నర్ అశ్విన్ భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. దీంతో కేవలం 9 పరుగులకే పర్యాటక జట్టు రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హోప్‌, హెట్‌మైర్‌‌లు ఆచితూచి ఆడేప్రయత్నం చేశారు.

 వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లలో ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం

వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లలో ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం

అయితే, ఆ తర్వాత రెండు వరుస ఓవర్లలో షెయ్ హోప్(28), హెట్‌మెయిర్(17) వికెట్లు పడగొట్టిన టీమిండియా మ్యాచ్‌లో పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన రోస్టన్ ఛేజ్(6) కూడా వెనుదిరగడం... అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లలో ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. వెస్టిండిస్ బ్యాట్స్‌మన్లలో సునీల్‌ అంబ‍్రిస్‌(38) టాస్ స్కోరర్‌గా నిలిచాడు.

రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్

ఇక, తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సత్తాచాటిన ఉమేశ్‌ యాదవ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను సాధించాడు. దీంతో ఓ టెస్టులో తొలిసారి 10 వికెట్లను తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్‌కి తోడు రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ రెండు వికెట్లు తీశాడు. కుల్డీప్‌ యాదవ్ ఒక వికెట్‌ తీసుకున్నాడు.

Story first published: Sunday, October 14, 2018, 17:36 [IST]
Other articles published on Oct 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X