న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డే/నైట్‌ టెస్ట్‌.. షమీ నుండి సూచనలు తీసుకున్న బంగ్లా బౌలర్!!

IND vs BAN,2nd Test : Abu Jayed Takes Tips From Shami To Prepare For D/N Test || Oneindia Telugu
Abu Jayed takes tips from Mohammed Shami to prepare for D/N Test at Eden Gardens

ఇండోర్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా ఇరు జట్ల మధ్య ఈనెల 22న చారిత్రక డే/నైట్‌ టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఆడబోతున్న తొలి డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈడెన్‌పైనే ఉంది.

<strong>ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ఎంతపని చేసింది!: ఏడాదిపాటు నిషేధానికి గురైన స్మిత్</strong>ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ఎంతపని చేసింది!: ఏడాదిపాటు నిషేధానికి గురైన స్మిత్

షమీ భాయ్‌తో మాట్లాడా:

షమీ భాయ్‌తో మాట్లాడా:

డే/నైట్‌ టెస్టు కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఇండోర్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బంగ్లా మీడియం పేసర్ అబూ జయేద్ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ వద్ద సూచనలు తీసుకున్నాడు. తాజాగా ప్రాక్టీస్ అనంతరం జయేద్ మాట్లాడుతూ... 'నేను షమీ భాయ్‌తో మాట్లాడాను. డే/నైట్‌ టెస్ట్‌ కోసం కొన్ని సూచనలు ఇచ్చాడు. అవి వచ్చే టెస్టులో అమలు చేయడానికి ప్రయత్నిస్తా. సీమ్‌ను ఉపయోగిస్తున్న షమీకి నాకు మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి' అని అన్నాడు.

బౌలింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టా:

బౌలింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టా:

'షమీ బౌలింగ్ చేయడాన్ని నేను చాలా సార్లు చూశా. అతను ఎలా బౌలింగ్ చేస్తున్నాడనే దానిపై నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. షమీ నాకన్నా ఎత్తుగా ఉన్నాడా లేదా సమాన ఎత్తులో ఉన్నాడా అని తెలుసుకోవడానికి అతని ఎత్తును నాతో పోల్చుకున్నా. అప్పుడు నేను అతనిలాగే బౌలింగ్ చేయవచ్చని గుర్తించాను. షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతనో టాప్ బౌలర్' అని జయేద్ పేర్కొన్నాడు.

నాలుగు వికెట్లతో సత్తాచాటిన జయేద్:

నాలుగు వికెట్లతో సత్తాచాటిన జయేద్:

తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లా ఓడిపోయినా.. మీడియం పేసర్ అబూ జయేద్ మాత్రం అద్భుతంగా రాణించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోతే అందులో నాలుగు జయేద్ తీసాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా, అంజిక్య రహానే వంటి టాప్ బ్యాట్స్‌మన్‌లను పెవిలియన్ చేర్చాడు.

కెరీర్‌ బెస్టు ర్యాంకులో షమీ:

కెరీర్‌ బెస్టు ర్యాంకులో షమీ:

ఇండోర్ టెస్టు మ్యాచ్‌లో షమీ మొత్తం 7 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3/27, రెండో ఇన్నింగ్స్‌లో 4/31 అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ విజయాల్లో షమీ ముఖ్యపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న షమీ.. తాజాగా ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్టు ర్యాంకుకు చేరుకున్నాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో షమీ 8మిది స్థానాలు ఎగబాకి టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. టెస్టుల్లో 790 రేటింగ్‌ పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.

Story first published: Monday, November 18, 2019, 16:24 [IST]
Other articles published on Nov 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X