న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్ ఆటగాడికి యువీ పంజాబీ పాఠాలు.. నవ్వుకుంటున్న నెటిజన్లు (వీడియో)

#WatchVideo : Yuvraj Singh Posted A Funny 'Punjabi Video' On Instagram ! || Oneindia Telugu
Abu Dhabi T10 League: Yuvraj Singh Makes West Indies Player Chadwick Walton Speak In Punjabi

అబుదాబి: ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్నాడు. లీగ్‌ ప్రాంచైజీ అయిన మరాఠా అరేబియన్స్ తరఫున యువీ పొట్టి క్రికెట్‌ ఆడుతున్నాడు. మరాఠా జట్టుకు విండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రేవో కెప్టెన్. యువరాజ్‌ ఈ టీ10లీగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయడంలో విఫలం అయ్యాడు. అయితే మరాఠా జట్టు మాత్రం గ్రూప్‌-బీలో అగ్రస్థానంలో ఉంది.

'పూరన్‌ శిక్షతో నాకు సంబంధం ఏంటి.. అతనికి తక్కువ శిక్ష వేస్తే ఇబ్బందేమీ లేదు''పూరన్‌ శిక్షతో నాకు సంబంధం ఏంటి.. అతనికి తక్కువ శిక్ష వేస్తే ఇబ్బందేమీ లేదు'

పంజాబీ పాఠాలు:

పంజాబీ పాఠాలు:

మ్యాచ్‌లకు మధ్య సమయం దొరకడంతో డ్రెస్సింగ్ రూంలో యువీ సరదాగా గడిపాడు. దీనికి సంబందించిన వీడియోను యువీ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. అబుదాబితో మ్యాచ్‌ గెలిచాక విండీస్‌ ఆటగాడు చాద్విక్‌ వాల్టన్‌తో సరదాగా పంజాబీ భాష మాట్లాడించే ప్రయత్నం చేశాడు యువీ. పంజాబీలో మాట్లాడిన చాద్విక్‌.. తర్వాత ఒక్కసారిగా నవ్వాడు. యువరాజ్‌ కూడా పంజాబీలో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు.

నవ్వు ఆపుకోలేకపోయిన రైనా:

నవ్వు ఆపుకోలేకపోయిన రైనా:

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన క్రికెటర్లు సురేశ్‌ రైనా, ప్రవీణ్‌ కుమార్‌ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇద్దరు నవ్వుల రూపంలో ఉన్న ఎమోజిలతో కామెంట్లు పెట్టారు. మరోవైపు అభిమానులు కూడా వీడియో చూసి తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు. కోరీ ఆండర్సన్, మొయిన్ అలీ, నిరోషన్ డిక్వెల్లా, క్రిస్ లిన్, లసిత్ మలింగ, మహ్మద్ ఇర్ఫాన్ లాంటి ఆటగాళ్లు మరాఠా జట్టులో ఉన్నారు.

కేకేఆర్‌ది తప్పుడు నిర్ణయం:

కేకేఆర్‌ది తప్పుడు నిర్ణయం:

ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్‌ను విడుదల చేయాలన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) నిర్ణయం సరైనది కాదు అని యువరాజ్‌ అన్నాడు. సోమవారం యువరాజ్‌ మాట్లాడుతూ... 'కేకేఆర్‌ క్రిస్ లిన్‌ను విడుదల చేయడం నన్ను ఆశ్చర్యంకు గురిచేసింది. ఐపీఎల్‌లో నేను చూసిన ఒక ప్రత్యేక ఆటగాడు లిన్‌. కేకేఆర్‌కు ఎన్నో మంచి ఆరంభాలు ఇచ్చాడు. లిన్‌ను ఎందుకు వదులుకున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు. అది కేకేఆర్‌ తప్పుడు నిర్ణయం అనుకుంటున్నా. దీనిపై కేకేఆర్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌కు మెస్సేజ్‌ ఉందా' అని యువీ అన్నాడు.

కోచింగ్ చేస్తానేమో:

'విదేశీ లీగ్‌లో ఆడటంపై సంతృప్తిగా ఉంది. వచ్చే రెండు మూడేళ్లలో మరిన్ని లీగ్‌లు రాబోతున్నాయి. వాటిలో కొన్నింటిని ఆడటానికి ఎదురు చూస్తున్నా. ఒక ఏడాది మొత్తంగా ఆడేకంటే.. రెండు మూడు నెలలు క్రికెట్‌ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. రాబోయే కొన్నేళ్లు కూడా ఇలానే చేస్తా. ఆ తర్వాత కోచింగ్ చేస్తానేమో' అని యువీ తెలిపాడు.

Story first published: Tuesday, November 19, 2019, 20:00 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X