న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ఆడతా.. బెంగళూరు నాకు ప్రత్యేకం: డివిలియర్స్

AB De Villiers Says He Will Keep On Playing Indian Premier League

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు డివిలియర్స్. మళ్లీ అంతే ఆశ్చర్యకరమైన వార్త చెప్పాడు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. ఏబీ డివిలియర్స్‌. ఫుల్‌ఫామ్‌లో ఉన్న డివిలియర్స్‌ ఇదే జోరు కొనసాగిస్తే 2019 ప్రపంచకప్‌ కచ్చితంగా దక్షిణాఫ్రికాదే అనుకున్నారంతా. కానీ అనూహ్యాంగా ఈ మిస్టర్‌ 360.. 'బాగా అలిసిపోయాను.. ఫామ్‌లో ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నానంటూ' ఓ వీడియో ద్వారా రిటైర్మెంట్‌ ప్రకటించి అభిమానులకు ఊహించని విధంగా షాక్‌ ఇచ్చాడు.

ఐపీఎల్‌ గురించి సంచలన వార్త

ఐపీఎల్‌ గురించి సంచలన వార్త

తాజాగా తెలిసిన వివరాల ప్రకారం.. రిటర్మైంట్ ప్రకటించిన సమయంలో ఏబీ మాట్లాడుతూ.. విదేశాల్లో నిర్వహించే లీగ్‌ల్లో ఆడాలనే ఆలోచన లేదని, దేశవాళీ క్రికెట్లో టైటాన్స్ జట్టుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. అయితే స్వదేశంలో టీ20 లీగ్‌లో టైటాన్స్‌ తరఫున కొనసాగతానని చెప్పి.. ఐపీఎల్‌ గురించి సంచలన వార్త ప్రకటించాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ టోర్నీలో డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అద్భుత అవకాశాలు: ఇండియాలో 4 కోట్ల ఉద్యోగాలు

ఎలాంటి ప్రణాళికలు లేవు

ఎలాంటి ప్రణాళికలు లేవు

తాజాగా న్యూస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న డివిలియర్స్ మరికొంత కాలం ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ‘ఐపీఎల్‌లో కొన్నేళ్ల పాటు ఆడాలనుకుంటున్నా. మరోవైపు టైటాన్స్‌కు కూడా ఆడుతూ యువ ఆటగాళ్లకు తోడ్పాటునందించాలని నిర్ణయించుకున్నా. అయితే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై ఎలాంటి ప్రణాళికలు లేవు. వీటిలోనూ ఎక్కువకాలం కొనసాగుతానని మాత్రం చెప్పలేనంటూ' డివిలియర్స్‌ చెప్పుకొచ్చాడు.

అక్కడే 100వ టెస్టు మ్యాచ్‌ ఆడా

అక్కడే 100వ టెస్టు మ్యాచ్‌ ఆడా

ప్రపంచం నలుమూలలా నుంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఏంచేయాలనేదానిపై ఓసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బెంగళూరు ఓ ప్రత్యేకమైన ప్రదేశం. నిజానికి అది నా రెండో ఇళ్లు. అక్కడే నా కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడాను. నా జీవితంలో ఆర్‌సీబీ పాత్ర చాలా ఉంది. భారత్ ఒక దేశంగా నన్ను తీసుకొని ఆదరించింది. ఆ ఫీల్‌ను వివరించాలంటే కష్టం. నేనే కేవలం క్రికెట్ మాత్రమే ఆడా. అక్కడే 100వ టెస్టు మ్యాచ్‌ ఆడాను. కచ్చితంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నా జీవితంలో ఒక భాగమంటూ ఈ మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు.

డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్‌

డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్‌

ఐపీఎల్‌ ఆరంభంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్‌.. 2011 నుంచి రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో మొత్తం 141 మ్యాచ్‌లాడిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ 3953పరుగులు సాధించాడు. అందులో మూడు శతకాలుండగా, వ్యక్తిగత అత్యధిక స్కోరు 133.

Story first published: Wednesday, July 11, 2018, 10:35 [IST]
Other articles published on Jul 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X