న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విచిత్రంగా ఆరోన్ పించ్ అవుట్.., వికెట్ కీపర్ కోరాడనే..??

Aaron Finchs 172 against hosts must convince Australian selectors to not tinker with his top-order slot

హైదరాబాద్: తన రికార్డును తానే అధిగమించిన ఆరోన్ పించ్ అనుకోని విధంగా అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా-పాకిస్థాన్-జింబాబ్వే మధ్య జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు అరోన్ ఫించ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 76 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సులతో ఏకంగా 172 పరుగులు చేశాడు. ఈ దెబ్బతో అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

హిట్‌ వికెట్ రూపంలో పెవిలియన్ బాట

హిట్‌ వికెట్ రూపంలో పెవిలియన్ బాట

గతంలో అతని పేరిట ఉన్న 156 పరుగుల రికార్డును ఈ సందర్భంగా ఫించ్ అధిగమించాడు. అయితే ఇంతటి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ అంతే విచిత్రంగా ఔట్ అయ్యాడు. ఎటువంటి బంతి వేసిన చితక్కొటిన ఫించ్ చివరికి హిట్‌ వికెట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. 20వ ఓవర్‌ రెండో బంతికి వైడ్ బంతిని ఆడేందుకు ప్రయత్నించి హిట్ వికెట్ అయ్యాడు.

 కీపర్ మిమ్మల్ని ఔట్ అవ్వాలని కోరాడా..?

కీపర్ మిమ్మల్ని ఔట్ అవ్వాలని కోరాడా..?

మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధి ఫించ్ వికెట్ గురించి ప్రశ్నించాడు.. కీపర్ మిమ్మల్ని ఔట్ అవ్వాలని కోరాడా..? ఎందుకంటే వాళ్లకు మీ వికెట్ తీసేందుకు అదొకటే మార్గం ఉంది. మీరు అవుట్ అవడం గురించి ఏమనుకుంటున్నారు? అని అడగగా.. ఫించ్ ఇలా స్పందించాడు.

స్లో వైడ్ బాల్ అని అనుకున్నా

స్లో వైడ్ బాల్ అని అనుకున్నా

‘అది స్లో వైడ్ బాల్ అని అనుకున్నా.. కాబట్టి నేను వెనక్కి వెళ్లాను.. దీంతో బాల్ నాకు అందలేదు. కాబట్టి దాన్ని వదిలేద్దాం అని అనుకున్నా.. అప్పటికే బంతి చాలా దూరం వెళ్లింది. నేను అంత దూరం అని ఊహించలేకపోయాను. కానీ ఈలోపే నా బ్యాట్ వికెట్లకు తగిలింది. కాస్త నిరాశగానే ఉంది. నాటౌట్‌గా ఉంటే బాగుండేది' అని తెలిపాడు.

20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 229 పరుగులు

20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 229 పరుగులు

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫించ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయడంతో ఆస్ట్రేలియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా తొలి వికెట్‌కి ఫించ్, షార్ట్‌లు జత చేసిన 223 పరుగుల భాగస్వామ్యం.. అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక భాగస్వామ్యం కావడం మరో విశేషం.

Story first published: Wednesday, July 4, 2018, 18:47 [IST]
Other articles published on Jul 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X