న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్‌లో సెంచరీ: ఆరోన్ ఫించ్ ఖాతాలో అరుదైన రికార్డు

Aaron Finch achieves unique milestone after gritty century against England in ICC World Cup 2019

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ 115 బంంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో సెంచరీని సాధించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ టోర్నీలో ఫించ్‌కు ఇది రెండో సెంచరీ కాగా మొత్తంగా వన్డేల్లో 14వ సెంచరీ. తద్వారా ప్రపంచకప్‌లో ఒకే జట్టుపై రెండు సెంచరీలు చేసిన ఏడో బ్యాట్స్‌మన్‌గా ఆరోన్‌ ఫించ్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ వెస్టిండిస్ జట్టుపై మూడు సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.

కెన్యాపై సచిన్

కెన్యాపై సచిన్

ఇక, సచిన్‌ టెండూల్కర్‌ (కెన్యాపై), బ్రియాన్‌ లారా (దక్షిణాఫ్రికాపై), గంగూలీ (కెన్యాపై), స్కాట్‌ స్టయిరిస్‌ (శ్రీలంకపై), రికీ పాంటింగ్‌ (భారత్‌పై) రెండేసి సెంచరీలు సాధించారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ వైఫల్యంతో ఆసీస్‌ చేతిలోనూ చావుదెబ్బ తింది.

ఇంగ్లాండ్‌కు మూడో ఓటమి

ఇంగ్లాండ్‌కు మూడో ఓటమి

సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక టోర్నీలో మూడో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. దీంతో సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా మాత్రం అదరగొట్టే ఆటతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఆసీస్.. వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలిచింది.

286 పరుగుల లక్ష్యంతో

286 పరుగుల లక్ష్యంతో

286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ల ఖాతా తెరిచింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్ జేమ్స్ విన్స్‌ (0)ను బెహ్రన్‌డార్ఫ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయగా.. మిచెల్ స్టార్క్‌ అద్భుత బంతికి జో రూట్‌ (8) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక పుల్‌ షాట్‌ ఆడబోయి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ (4) క్యాచ్ ఔట్ అయ్యాడు. 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది.

అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరిన బట్లర్

అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరిన బట్లర్

ఈ దశలో బెయిర్‌స్టో (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసాడు. అయితే బెయిర్‌స్టోను బెరెన్‌డార్ఫ్‌ ఔట్‌ చేశాడు. 56కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సమయంలో పోరాటపటిమను ప్రదర్శించిన స్టోక్స్‌.. బట్లర్‌ (25)తో కలిసి వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. అతడితో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించున్న బట్లర్‌.. చివరకు అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.

ఐదు వికెట్లు తీసిన బెహ్రెన్‌డార్ఫ్‌

ఐదు వికెట్లు తీసిన బెహ్రెన్‌డార్ఫ్‌

ఈ క్రమంలో 75 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రిస్‌ వోక్స్‌ (26) అతనికి కొంత సహకారం అందించినా వేగంగా ఆడలేకపోయాడు. రెండు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన స్టోక్స్‌ (89; 115 బంతుల్లో 8×4, 2×6)ను స్టార్క్‌ అద్భుత బంతితో బోల్డ్ చేసాడు. ఆ తర్వాత అలీ, వోక్స్ , రషీద్, ఆర్చర్ ఔట్ అవ్వడంతో ఇంగ్లండ్‌ 44.4 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. బెహ్రెన్‌డార్ఫ్‌ ఐదు వికెట్లు తీశాడు.

Story first published: Wednesday, June 26, 2019, 13:51 [IST]
Other articles published on Jun 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X