న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గంగూలీని కెప్టెన్సీ నుండి తొలగించాలనుకున్నాడు.. విజయవంతం అయ్యాడు'

Aakash Chopra said John Buchanan wanted to remove Sourav Ganguly from captaincy at KKR

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌కెప్టెన్‌గా ఉన్న సౌరవ్‌ గంగూలీని ఆ పదవి నుంచి తొలగించాలని అప్పటి కోచ్‌ జాన్‌ బుచానన్‌ కుట్రలు పన్నాడని భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. ఒకానొక దశలో దాదాను సారథ్యం నుంచి తొలగించాలని భావించిన బుచానన్‌.. ఆ పనిలో విజయవంతం అయ్యాడని పేర్కొన్నాడు. గంగూలీ, బుచానన్‌ మధ్య విభేదాల కారణంగానే అప్పట్లో నైట్‌రైడర్స్‌ అంతగా రాణించలేదని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

 విండీస్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే.. కరన్ ఔట్.. కెప్టెన్‌గా స్టోక్స్‌!! విండీస్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే.. కరన్ ఔట్.. కెప్టెన్‌గా స్టోక్స్‌!!

దాదా కెప్టెన్సీకి ఎసరు:

దాదా కెప్టెన్సీకి ఎసరు:

తాజాగా ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'పీఎల్‌ ఆరంభ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు బుచానన్‌ కోచ్‌. గంగూలీ కెప్టెన్‌. కేకేఆర్‌లోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఉన్నాడు. మొదట్లో వీరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నా.. ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. 2009లో బుచానన్‌ బహుళ సారథ్య పద్ధతిని ప్రవేశపెట్టాలనుకున్నాడు. అది గంగూలీకి అస్సలు ఇష్టం లేదు. వీరిద్దరి మధ్య సారుప్యం కుదరలేదు' అని అన్నాడు.

బుచానన్‌ విజయవంతం అయ్యాడు:

బుచానన్‌ విజయవంతం అయ్యాడు:

'సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తొలగిద్దామని జాన్‌ బుచానన్‌ అనుకున్నాడు. ఆ విషయంలో సక్సెస్ కూడా అయ్యాడు. ఆ తర్వాత సీజన్‌లో బ్రెండన్ మెక్‌కలమ్‌ నాయకుడిగా ఎంపికయ్యాడు. కానీ మొదటి సీజన్‌లో పరుగుల వరద పారించిన అతడు 13 మ్యాచుల్లో 189 పరుగులే చేశాడు. ఇక పాయింట్ల పట్టికలో జట్టు 8వ స్థానంలో నిలిచింది. తొలి సీజన్‌లో ఆరో స్థానంలో ఉంది. మళ్లీ దాదా సారథిగా ఎంపికవ్వగా.. బుచానన్‌ వెళ్లిపోక తప్పలేదు' అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.

2012, 14లలో టైటిల్ విజేత:

2012, 14లలో టైటిల్ విజేత:

నిజానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌ముగ్గురు కెప్టెన్ల విధానం అనుసరించేందుకు ప్రయత్నించిందని క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. చివరికి అది డామినో ప్రభావానికి దారితీసిందన్నాడు. దాంతో మిగతా అన్నిటిపై ప్రతికూల ప్రభావం పడిందన్నాడు. బుచానన్‌ తనకు కావాల్సిన సహాయకులు, కుటుంబ సభ్యులు,స్నేహితులను నియమించుకొనేందుకు ప్రయత్నించగా.. అది బెడిసికొట్టిందని ఆకాశ్‌ చెప్పుకొచ్చాడు. ఆపై గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 14లలో టైటిల్ విజేతగా నిలిచింది.

Story first published: Saturday, July 4, 2020, 19:52 [IST]
Other articles published on Jul 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X