న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా మాజీ క్రికెటర్ ఒక్క పూట భోజనం రూ.7 లక్షలు

Aakash Chopra Posts Food Bill Of 7 Lakhs, Leaves Twitterati stumped
Aakash Chopra posts food bill of 7 lakh, leaves Twitterati stumped

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా చెల్లించిన బిల్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కుటుంబంతో కలిసి ఒక్క పూట భోజనం చేసినందుకుగాను ఏకంగా ఏడు లక్షల బిల్లు కట్టాడట చోప్రా. ఈ విషయాన్ని అతడే ట్విటర్‌లో చెప్పాడు. అంతేకాదు ఆ బిల్లును కూడా పోస్ట్ చేశాడు. 'మీల్స్‌ కోసం సుమారు ఏడు లక్షల మేర బిల్లు చెల్లించాల్సి వచ్చింది.. వెల్‌కమ్‌ టూ ఇండోనేషియా' అంటూ ట్వీట్‌ను షేర్‌ చేశారు.

అది చూసిన వారందరికీ ఎంత గ్రాండ్ పార్టీనో అనుకుంటారు. కానీ, అది కేవలం ఒక కుటుంబం సాధారణంగా తిన్న భోజనం ఖరీదు. చోలె కర్రీ 90 వేలట. పన్నీర్ బటర్ 99 వేలట. పన్నీర్ టిక్కా 96 వేలట.. ఇలాంటి బిల్లు మీరెప్పుడైనా చూశారా?

ఈ ట్వీట్‌ను జులై 15 రాత్రి పోస్ట్ చేశాడు ఆకాశ్ చోప్రా. అంత బిల్లు ఎలా సాధ్యమో తెలియక. కానీ మరుసటి రోజు ఉదయం చోప్రా అసలు విషయాన్ని ట్విటర్‌లోనే చెప్పాడు. అదేంటో తెలుసా.. అతడు బిల్లు కట్టింది ఇండోనేషియా కరెన్సీలో.. అంటే, ఆకాశ్ చోప్రా కట్టింది రూ. 3334 మాత్రమే. రాత్రంతా చోప్రా ఈ ట్వీట్ సస్పెన్స్‌ను కొనసాగించడం చూసి కొందరు ఫ్యాన్స్ హాయిగా నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం రుసరుసలాడారు.

ఆయన చెల్లించింది ఇక్కడ కాదు ఇండోనేషియా రెస్టారెంట్‌లో.. మన దేశీయ కరెన్సీ ప్రకారం ఏడు లక్షలన్న మాట. ఒక్క రూపాయితో 210 ఇండోనేషియా రూపియాలకు సమానం. ఆకాశ్‌ చోప్రా షేర్‌ చేసిన ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆకాశ్‌ చోప్రా 2003 నుంచి 2004 వరకు డిఫెన్సివ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఆడేవారు.

Story first published: Thursday, July 19, 2018, 14:52 [IST]
Other articles published on Jul 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X