న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లీకైన వీడియో: మాజీ ప్రేయసితో లంక మాజీ క్రికెటర్ జయసూర్య శృంగారం

సనత్ జయసూర్య ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తన మాజీ ప్రేయసితో అతడు సన్నిహితంగా ఉన్న శృంగార వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: సనత్ జయసూర్య... శ్రీలంక మాజీ కెప్టెన్‌గానే కాకుండా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వ్యక్తిగా అందరికీ సుపరిచితం. ఒకానొక సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాంటి సనత్ జయసూర్య ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు.

తన మాజీ ప్రేయసితో అతడు సన్నిహితంగా ఉన్న శృంగార వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఈ కేసు శ్రీలంక సైబర్ నేరాల విభాగానికి చేరింది. మాజీ ప్రేయసితో అతడు శృంగారం జరుపుతున్న వీడియో బయట పడడంతో జయసూర్య ఇప్పుడు అందరి ముందు దోషిగా మారాడు.

ఇప్పుడు ఈ వీడియో వ్యవహారంపై శ్రీలంకకు చెందిన సైబర్ భద్రతా విభాగం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో అతనితో కలిసి శృంగారంలో పాల్గొన్న మహిళ ప్రస్తుతం లంకలోని ప్రఖ్యాత వ్యాపారవేత్త, మీడియా టైకూన్ భార్య అని వార్తలు వస్తున్నాయి. శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో జయసూర్య శృంగార వీడియో హల్ చల్ చేయడంతో ఆమె కంగుతింది.

తామిద్దరం సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీశాడు

తామిద్దరం సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీశాడు

వీడియో వైరల్‌ కావడంపై ఆమె కొలంబోలోని శ్రీలంక జాతీయ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌లో ఫిర్యాదు చేసింది. తామిద్దరం సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ వీడియో తీశాడని బోరుమంది. తనపై ప్రతీకారంతోనే జయసూర్య ఆ విధంగా చేశాడని ఆమె తన స్నేహితులవద్ద వాపోయింది. జయసూర్య తన భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకపోవడంతో తాము ఓ గుడిలో నిశ్చితార్థం చేసుకున్నామని ఆమె వెల్లడించింది.

ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కట్‌ చేశారు

ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కట్‌ చేశారు

కాగా, శుక్రవారం ఉదయం నుంచి తమ కార్యాలయానికి ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కట్‌ చేశారని జయసూర్య మాజీ ప్రేయసి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఉద్యోగులందరూ సెల్‌ఫోన్లలో ఆ వీడియోను చూశారని తెలిపాయి. శుక్రవారం విధుల్లో ఉన్న ఆ కార్యాలయ ఉద్యోగుల మొబైల్‌ ఫోన్లను యాజమాన్యం స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

అందుబాటులో లేని జయసూర్య

అందుబాటులో లేని జయసూర్య

ఈ విషయమై జయసూర్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, అతడు అందుబాటులోకి రాలేదు. అయితే జయసూర్య తనకే పాపం తెలియదని వాదిస్తున్నట్టు అతని సన్నిహిత వర్గాలు అంటున్నాయ. అంతర్జాతీయ క్రికెట్‌కు జయసూర్య వీడ్కోలు పలికిన తర్వాత శ్రీలంక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

రాజపక్సే అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన జయసూర్య

రాజపక్సే అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన జయసూర్య

రాజపక్సే అధికారంలో ఉన్నప్పుడు జయసూర్య స్థానిక ప్రభుత్వం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పని చేశాడు. అంతేకాదు శ్రీలంక దేశ ప్రజలకు అందించే దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘దేశబంధు' అవార్డుని కూడా అందుకున్నాడు. ఒకరి వ్యక్తితగ జీవితం గురించి సోషల్ మీడియాలో ఉంచడం చట్టవిరుద్ధం కాబట్టి, సైబర్ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X