న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా కన్ఫామ్ కాలేదు.. తప్పుడు ప్రచారాన్ని ఆపండి : అలెక్స్ హేల్స్

A journalist ‘wrongly’ tweets Alex Hales tested positive for Coronavirus, the opener gives a fitting response

లండన్: దేశాన్ని వీడినా 24 గంటల్లోనే ఓ ఓవర్‌సీస్ ప్లేయర్ కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీఎస్‌ఎల్ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లను రద్దు చేసింది. కానీ ఆ ఓవర్‌సీస్ ప్లేయర్ వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటించింది. కానీ ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమిజ్ రాజా కరోనా లక్షణాలతో బాధపడుతున్నా ఆ ఆటగాడెవరో మీడియాకు తెలపడంతో ఒక్కసారిగా యావత్ క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది.

హెల్స్‌కు కరోనా లక్షణాలు..

కరాచీ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్.. కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు రమిజ్ రాజా మీడియాకు తెలిపారు. ‘ఇదో దురదృష్టకర సందర్భం. చివరికైతే మంచి నిర్ణయమే తీసుకున్నారు. పీఎస్‌ఎల్‌ను వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలెక్స్ హేల్స్‌ కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. అతనికి వెంటనే పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ రావాల్సి ఉంది. బ్రాడ్‌కాస్టర్స్, కామెంటేటర్స్‌ము కూడా రాబోయే రెండు గంటల్లో కరోనా టెస్ట్‌లు చేయించుకోనున్నాం.'అని న్యూస్ 99 అనే చానెల్‌కు రమిజ్ రాజా తెలిపారు.

తప్పుడు వార్తలు వద్దు..

అయితే ఓ జర్నలిస్ట్ ఏకంగా అలెక్స్ హెల్స్‌‌కు కరోనా టెస్ట్‌ల్లో పాజిటీవ్ వచ్చిందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన అలెక్స్ ‘తప్పుడు వార్తల ప్రచారాన్ని ఆపండి. ఇది చాలా ప్రమాదకర బిహేవియర్'అంటూ కామెంట్ చేశాడు. తనకు కరోనా వైరస్ వచ్చిందంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు.

నా పరిస్థితి ఇది..

నా పరిస్థితి ఇది..

‘క్రికెట్ వరల్డ్, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో నా ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాతో సహా చాలా మంది ఓవర్‌సిస్ ఆటగాళ్లు కొవిడ్-19 ప్రాణాంతక వైరస్ కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) నుంచి తప్పుకొని స్వదేశానికి వచ్చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నా ఫ్యామిలీతో ఉండటం నాకు కూడా ముఖ్యమనిపించింది.

శనివారం ఉదయమే నేను లండన్ చేరుకున్నాను. అప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు. కానీ ఆదివారం లేవగానే ఫీవర్ వచ్చినట్లు అనిపించింది. ప్రభుత్వ సూచనతో ఐసోలెషన్‌‌గా చికిత్స తీసుకుంటున్నాను. జ్వరంతో కొంత దగ్గు కూడా ఉంది. ప్రస్తుతానికి కరోనాకు సంబంధించిన ఎలాంటి టెస్ట్‌లు నిర్వహించలేదు. తర్వాత నిర్వహించవచ్చు. నా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తా 'అని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.

Story first published: Tuesday, March 17, 2020, 18:56 [IST]
Other articles published on Mar 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X